Saturday, May 11, 2024
- Advertisement -

హైదరాబాద్ బిచ్చగాళ్ళ వార్షిక ఆదాయం 270 కోట్లు .. సంచలన సర్వే వెల్లడి

- Advertisement -
Beggars income in Hyderabad

రోడ్డు పక్కన, సిగ్నల్స్ దగ్గరా , బస్టాండ్ లలో , రైల్వే స్టేషన్ లలో , గుడి లో , షాపింగ్ మాల్ , పర్యాటక ప్రాంతాలలో ఎక్కడ పడితే అక్కడ కనిపించే యాచకుల ( beggars) కి బోలెడు కష్టాలు ఉంటాయి. వారు తమ కష్టాలు చెబుతూ ఉంటే మనకి బాధ వేసి మరీ డబ్బులు చిల్లర ఇస్తుంటాం.

 నెలలు నిండని చంటిపిల్లల్ని భుజాన ఎత్తుకొని అత్యంత దీనంగా యాచకత్వం చేస్తుంటారు. వారిని చూసినంతనే అయ్యో పాపం.. అనిపించి వెంటనే డబ్బులు వేసే పరిస్థితి. మహానగరం లో బిచ్చగాళ్ళు లేకుండా చెయ్యాలి అనే ఉద్దేశ్యం తో జీహెచ్ఎం సి భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. బెగ్గర్ ఫ్రీ సిటీ అనే పేరు పెట్టిన ఈ ప్రోగ్రాం లో హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉన్న బిచ్చగాళ్ళ వివరాలూ , ఆడాయాలూ , వారు ఏ పరిస్తితి లో ఉన్నారు ఇలాంటి సర్వే నడుస్తోంది. హైదరాబాద్ సిటీలో మొత్తంగా 20వేల మంది యాచకులు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. వీరి రోజువారీ ఆదాయం అక్షరాల రూ.75 లక్షలు.

వార్షికఆదాయం రూ.270కోట్లుగా లెక్క తేల్చారు. మొత్తం బిచ్చగాళ్లలో 90 శాతం మంది నకిలీ బిచ్చగాళ్లుగా అధికారులు తేల్చారు. పని చేసే శక్తి ఉన్నప్పటికీ అయాచితంగా వచ్చే ఆదాయాన్ని వదులుకోలేక బిచ్చం ఎత్తుకునే పనిలో బిజీగా ఉండే వారే ఎక్కువగా తేల్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -