Sunday, May 5, 2024
- Advertisement -

వంకాయ్ తింటే ఇన్ని లాభాలా.. నమ్మలేకపోతున్నారా..

- Advertisement -

‘వంకాయ కూర’ గురించి ఎస్ వి కృష్నారెడ్డి గారు చెప్పిన మాటలు ఎంతమందికి గుర్తుందో తెలియదు గాని… వంకాయ లో ఉన్న లాభాలు తెలిస్తే.. ఆహా ఏమి రుచి తినరా మైమరచి అని మరోసారి పాటేసుకుంటారు. నిజానికి వంకాయలో చాలా విశిష్ట గుణాలున్నాయి.

వంకాయలో లెక్కలేనన్ని పోషకాలు, విటమిన్స్ ,ఫాస్ఫరస్, కాపర్, డయటరీ ఫైబర్, ఫోలిక్‌ యాసిడ్, పొటాషియమ్,మాంగనీస్‌ ఫుల్ గా ఉన్నాయి. ముందుగా చెపుకోవల్సిన విషయం… దీని ద్వారా వచ్చే ఫోలిక్‌ యాసిడ్‌ …గర్భస్థపిండంలో న్యూరల్‌ ట్యూబ్‌ అవాంతరాలను అదిరోహిస్తుంది. ఇక ఇందుల్లో ఉండే ఫైబర్‌… మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఫైబర్‌ చెడు కొలెస్ట్రాల్‌ను ఇట్టే తొలగిస్తుంది. రక్తనాళాలకు వచ్చే అథెరోస్క్లిరోసిస్‌ కండిషన్‌ను నివారించడం ద్వారా గుండెపోటు, పక్షవాతాన్ని చాలా వరకు నివారిస్తుంది.

అధిక బరువుతో బాధపడుతూ వెయిట్ తగ్గాలనుకునేవారు వంకాయ కూర తినడం మంచిది . వంకాయలో విటమిన్‌ సి ఎక్కువే ఉంటుంది. విటమిన్‌–సి ఒక పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌. ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. వంకాయ ద్వారా మనకు లభించే… క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్‌ … ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతూ, వాటిని పటిష్టం చేస్తుంది. ఆ రకంగా వంకాయ ఆస్టియోపోరోసిస్‌ను నివారించడానికి ఉపయోగపడుతుంది.

వంకాయ్ లో ఐరన్‌ మాదిరిగానే కాపర్‌ ఉంటుంది. ఎర్ర రక్తకణాలు సమపాళ్లలో ఉండాలంటే ఐరన్, కాపర్‌ అవసరం. వంకాయలోని ఫైటోన్యూట్రియెంట్లు మెదడును చురుగ్గా ఉంచుతాయి. అవి ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని మెదడుకు అందిస్తాయి. వంకాయలో సొల్యుబుల్‌ ఫైబర్‌… రక్తంలోకి చక్కెర నెమ్మదిగా విడుదలయ్యేందుకు దోహదపడుతుంది. కాబట్టి డయాబెటిస్‌ రోగులకు కూడా మంచిది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -