Monday, May 6, 2024
- Advertisement -

త్వ‌ర‌లో చికిత్స అందుబాటులోకి …

- Advertisement -

ప్ర‌పంచంలో చాలా మంది క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు. వంద‌ల మంది చ‌నిపోతున్నారు. క్యాన్స‌ర్ మొద‌టి స్టేజీలో ఉంటె దాన్ని నివారించ‌వ‌చ్చు. కాని ఇప్ప‌టి వ‌ర‌కు న‌యం చేసె వైద్య విధానాలు లేవు. ఇప్పుడిప్పుడే పూర్తిగా న‌యం చెసె దానిపై ఆశ‌లు చిగురిస్తున్నాయి. క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారిని పూర్తిగా న‌యం చెసె దిశ‌గా శాస్త్ర‌వేత్త‌లు ముంద‌డుగు వేశారు.

ఆపరేషన్ లేకుండా, చౌకైన సరికొత్త చికిత్స విధానాన్ని అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేన్సర్ చికిత్సలో కీమో ధెరపీ, శస్త్ర చికిత్స చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. గతంలో కేన్సర్ కణితులను నిర్మూలించేందుకు ఇధనాల్ బయో డీజిల్ కు మరొక రసాయనాన్ని కలపడం ద్వారా సరికొత్త వైద్య విధానం ఆవిష్కరించారు. ఈ విధానం ద్వారా కణితి మాయమైనప్పటికీ దాని పరిసరాల్లో కణజాలం కూడా నాశనమవుతోంది.

దీంతో దీనిపై పరిశోధనలు చేసిన డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా పురోగతి సాధించారు. ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఇథనాల్ కు ఇథైల్ సెల్యూజోన్ ను జోడించి పంపారు. కేవలం 8 రోజుల్లోనే ఎలుకల్లోని కేన్సర్ కణితులు పూర్తిగా మాయమైపోయాయి. ఈ విధానంలో కేన్సర్ కణితులను పూర్తిగా నిర్మూలించవచ్చని వారు చెబుతున్నారు. ఈ విధానం చాలా చౌకైనదని కూడా వారు చెబుతున్నారు.

ఈ విధానం సంప్రదాయ శస్త్రచికిత్స విధానానికి ఏమాత్రం తక్కువ కాదని, ఆపరేషన్ లాగే కణితులను పూర్తిగా నిర్మూలిస్తుందని వారు తెలిపారు. మరిన్ని పరిశోధనల ద్వారా దీనిని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని వారు తెలిపారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -