Friday, May 3, 2024
- Advertisement -

నిద్ర సరిగా లేకపోతే ఎంత డేంజరో తెలుసా ?

- Advertisement -

మనిషికి ఖచ్చితంగా కడిపు నిండా తిండి.. కంటి నిండా నిద్ర ఉండాలని చాలా మంది చెబుతుంటారు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి తక్కువ అయిన.. ఆ ఎపేక్ట్ మనిషి ఆరోగ్యం మీద పడుతోంది. ప్రధానంగా మనిషికి నిద్ర సరిపోను లేకుంటే తీవ్రమైన ఒత్తిడితో పాటు గుండె పోటు కూడా వచ్చే ఛాన్సులు చాలానే ఉన్నాయని వైద్యులు అంటున్నారు.

నిద్ర లేని కారణంగా మానసిక ఆందోళన మరియు శారీరక ఇబ్బందులు తలెత్తడం ఖాయం అని ఒక సర్వేలో తెలింది. రోజులో కనీసం ఏదైన సమయంలో 6 నుండి 8 గంటల పాటు నిద్ర అవసరం అని వైధ్యులు సూచిస్తున్నారు. ప్రతి రోజు నిద్ర సరిగ్గా లేకుంటే.. రక్తపోటుతో పాటు గుండె జబ్బులు, షుగర్‌, బీపీ వంటి దీర్ఘ కాలిక వ్యాధుల బారిన కూడా పడే అవకాశాలున్నాయని అంటున్నారు. నిద్ర సరిగా లేని వారి జీర్ణ వ్యవస్థ కూడా సరిగా పని చేయదు.

నిద్ర సరిగా లేకుంటే మనిషి వ్యాది నిరోధక శక్తి తగ్గుతుందని, దాంతో లేని పోని జబ్బులు అన్ని కూడా వస్తాయి. అందుకే ఖచ్చితంగా రోజులో 7 గంటలకు తగ్గకుండా నిద్ర పోవడం ఆరోగ్యానికి చాలా మంచిది అని వైధ్యులు చెబుతున్నారు. ఈ విషయంలో పెద్దలు కూడా కంటి నిండా నిద్ర చాలా మంచిదని.. నిద్ర ఉంటే ఎలాంటి సమస్యలు రావని అంటూ ఉంటారు. అందుకే కడుపు నిండా తినకపోయిన పర్లేదు కానీ కంటి నిండా నిద్ర పోయేందుకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -