Saturday, May 4, 2024
- Advertisement -

ఓటుకునోటు కేసు ఎఫెక్ట్ ..రేవంత్‌రెడ్డి బ్యాంక్ అకౌంట్లోకి కోట్లాదిరూపాయ‌లు

- Advertisement -

తెలంగాణాలో ఎన్నిక‌ల వేల కాంగ్రెస్ పార్టీ నేత‌ రేవంత్‌రెడ్డికి  చుక్కులు చూపిస్తోంది టీఆర్ఎస్ ప్ర‌భుత్వం. ఓటుకు నోటు కేసును మ‌రో సారి తెర‌పైకి తెచ్చి వేగంగా పావులు క‌దుపుతోంది. రేవంత్ దూకుడుకు అడ్డుక‌ట్ట వేసేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.

ఓటుకు నోటు కేసులో స్టీవెన్ సన్ ముందు రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకీ దొరికిన సంగ‌తి తెల‌సిందే. అయితే స్టీఫెన్ స‌న్ ముందుంచిన రూ.50 ల‌క్ష‌లు ఎక్క‌డ‌నుంచివ‌చ్చాయ‌నే విష‌యాన్ని తెలంగాణా ప్ర‌భుత్వం క‌నిపెట్ట‌లేక‌పోవ‌డంతో ఈడీకి ఫిర్యాదు చేసింది. రేవంత్ రెడ్డి బ్యాంకు ఖాతాలపై గత ఆరు నెలలుగా నిఘా పెట్టిన ఈడీ, ఐటీ అధికారులు రేవంత్‌రెడ్డి ఇండ్ల‌లో మెరుపు దాడులు చేయ‌డంతో సంల‌నంగా మారింది.

గత ఆరు నెలలుగా, ఆయన బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతూ ఉండటం, విదేశాల నుంచి లక్షలు వచ్చి పడుతుండటంపై పక్కా ఆధారాలు సంపాదించిన ఈడీ విభాగం, ఆ డబ్బుపై వివరాలు తెలుసుకునేందుకు దాడులు చేస్తున్నట్టు అనధికార వర్గాల అంచ‌నా.

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఆయన నివాసంతో పాటు కొడంగల్ లోని ఆయన నివాసంలోనూ అధికారులు సోదాలు జరుపుతున్నారు. దాడులకు వెళ్లగానే, కుటుంబ సభ్యుల అందరి ఫోన్లనూ అధికారులు స్వాధీనం చేసుకుని స్విచ్చాఫ్ చేసినట్టు తెలుస్తోంది.

అప్పట్లో రేవంత్ రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై తెలంగాణా ప్ర‌భుత్వం క‌నిపెట్ట‌క‌పోవ‌డంతో వారి తరఫున రాష్ట్ర డీజీపీ, ఈడీ సహకారాన్ని కోరుతూ కేంద్ర హోమ్ శాఖకు గతంలో లేఖ రాశారని, దానిపై హోమ్ శాఖ ఆదేశాల మేరకు ఈడీ కేసు పెట్టిందని తెలుస్తోంది.

రెండు వారాల క్రితం రేవంత్ రెడ్డి సోదరుడికి చెందిన ఓ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి కూడా విదేశాల నుంచి భారీగా నిధులు రావడంతో, ఐటీ నోటీసులు వెళ్లిన సంగతి తెలిసిందే. అందులోనూ రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది. ఈ నోటీసులకు రేవంత్ గానీ, ఆయన సోదరుడుగానీ సమాధానం ఇవ్వకపోవడంతో ఐటీ శాఖ కూడా నేటి దాడుల్లో భాగమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -