Monday, May 13, 2024
- Advertisement -

తల్లీ బిడ్డని నిమిషాల్లో కలిపిన వాట్స్ యాప్::

- Advertisement -

ఫేస్ బుక్ ,వాట్స్ యాప్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజాలు మనుషులనీ వారి ప్రాణాలనీ ఎలా కాపాడతాయి అనేదానికి ఇది మచ్చుక ఉదాహరణ, నిమిషాల వ్యవధి లో తప్పిపోయిన తల్లి బిడ్డలని ఈ వాట్స్ యాప్ కలిపేసింది.

వరంగల్ లోని కేసముద్రం లో చిట్టి సునీత అనే మహిళా తన రెండేళ్ళ కూతురు తో కలిసి బట్టలు కొనడం కోసం షాపుకు వెళ్ళింది , తల్లి బట్టలు సెలెక్ట్ చేస్తూ ఉండగా కూతురు నెమ్మదిగా అక్కడ నుంచి తన చేతిలో బంతి తో ఆడుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. దగ్గర లో ఉన్న రైల్వే స్టేషన్ వరకూ ఆ చిన్న పాప వెళ్ళిపోయేవరకూ ఆ తల్లి కి తన బిడ్డ గుర్తుకే రాలేదు. సడన్ గా పాప కనపడకపోవడం తో ఏడుస్తూ కూర్చుంది. ఇలోగా ఒక ఆటో డ్రైవర్ పాప ని చూసి ఆమె తల్లితండ్రుల కోసం ఆచూకీ తీయగా ఎవరూ ఆ పాప తమది కాదు అన్నారు. మరొక వైపు పాప కనపడక షాపు దగ్గర ఆ తల్లి ఏడుస్తూ కూర్చోవడం అందరినీ కలచివేసింది. ఆటో డ్రైవర్ నుంచి విషయం తెలుసుకున్న వెంకటేష్ అనే వ్యక్తి తన సెల్ ఫోన్ లో పాప ఫోటో తీసి విషయం రాసి సెల్ ఫోన్ లో వాట్స్ యాప్ ద్వారా ఆ ఊర్లో ఉన్న అందరికీ పంపించాడు ఒక హోటల్ యజమానికి ఆ మెసేజ్ కనిపించి వెంటనే ఆ తల్లికి ఆ ఫోటో చూపించి ఆ పాప ఎక్కడ ఉంది అనేది తెలపడం తో వెంటనే వెళ్లి తన పాపని తెచ్చుకుంది. తల్లీ బిడ్డలని ఈ రకంగా క్షణాల్లో వాట్స్ యాప్ కలిపేసింది అన్నమాట

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -