Sunday, May 12, 2024
- Advertisement -

జ‌గన్ సీఎం అయినా కోర్టుకెల్లాల్సిందేనా…?

- Advertisement -

జగన్ పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతుంది. జగన్ ఇప్పటి వరకు ఎన్ని సార్లు ప్రజాక్షేత్రంలో ఉన్నా రానంత క్రేజ్ పాదయాత్రకు వస్తుంది. ఎక్కడ చూసినా జనం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇలాంటి పరిస్గితుల్లో వైసీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి టీడీపీ పార్టీ వైసీపీపై దుమ్మెత్తిపోస్తుంది.

అయితే తెలుగు రాజకీయాలకు పాదయాత్రలు కొత్తేమీ కాదు. అయినప్పటికీ ఇక్కడ పాదయాత్రలు సంచలనమే. తొలిసారి సుదీర్ఘ పాదయాత్రను చేసింది జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. 2004 ఎన్నికల ముందు వైఎస్ చేపట్టిన ‘ప్రజాప్రస్థానం’ యాత్ర ఒక సంచలనంగా నిలిచింది. ఆ పాదయాత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు.ఇప్పుడు జగన్ కూడా సీఎం అవుతారన్న ప్రశ్న టీడీపీ నేతల్లో మెదలుతుంది.

టీడీపీపై జనాల్లో వ్యతిరేకత, ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్లీ మాట మార్చుతుండటం, ప్రత్యేక హోదా, పోలవరంలో స్కామ్ లు ఇలాంటి పరిస్దితుల్లో జనాల్లో వ్యతిరేకత వస్తుందని టీడీపీ భయపడుతుంది. జ‌గ‌న్ బ‌లాన్ని ప్ర‌జ‌ల్లో త‌గ్గించాల‌ని టీడీపీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోన్నా ఫ‌లించ‌డంలేదు.

పాద‌యాత్ర ద్వారా ప్రజల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి. దీంతో జగన్ సీఎం అవుతాడని వైసీపీ నాయకులు గట్టిగా నమ్ముతుంటే.. టీడీపీ నాయకులకు కూడా అనుమానాలు లేకపోలేదు. ఒక వేల జ‌గ‌న్ సీఎం అయినా అక్ర‌మాస్తుల‌కేసులో కోర్టుకు హ‌జ‌రు అవ్వాల్సిందేన‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. జ‌గ‌న్‌పై ఉన్న కేసులు ఇప్ప‌ట్లో తేల‌వ‌నే ధీమాతో ఉన్నారు టీడీపీ నాయ‌కులు. ఎవ‌రి వాద‌న‌లు ఎలా ఉన్నా జ‌గ‌న్‌పై ఉన్న కేసులు ఆయ‌న‌కు ఇబ్బంది క‌లిగించ‌డంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -