రిలయన్స్ జియో అందించిన ఫోన్లపై భారీగా స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్పందన ఏ రేంజ్ లో అంటే.. డిమాండ్ ను తట్టుకోలేక.. బుకింగ్స్ కూడా నిలివేయాలనే వరకు. అయితే ఈ జియ్ఫ్ ఫోన్ బుక్ చేసుకున్నవారు.. ఈ ఫోన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ ఫోన్ మీద ఆసక్తి చూపిస్తున్నావరు.. ఈ ఫోన్ బుక్ చేసుకున్నవారికి జియో చుక్కలు చూపించనుంది. మాండేటరీ రీచార్జ్ ల పేరుతో భారీ బాదుడుకు జియో రెడీ అయ్యింది. కనీస్ రీచార్జ్ లు, ఫోన్ రిటర్న్ లకు సంబంధించి పలు నిబంధనలను జియో తన వెబ్ సైట్లో పేర్కొంది. ఫోన్ కోసం కస్టమర్ డిపాజిట్ చేసిన రూ. 1500 సొమ్మును తిరిగి పొందాలంటే.. మూడు ఏళ్లలో కనీసం రూ. 4,500 విలువైన రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మూడేళ్లపాటు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా రూ. 1500 రీచార్జ్ చేసుకోవాల్సిందే. ఏ కారణంగానైనా మూడు నెలల పాటు రిచార్జ్ చేసుకోకపోతే.. డిపాజిట్ సొమ్మును జియో తిరిగి చెల్లిందలేదు.
అంతేకాకుండా.. ఒక వేళ మధ్యలోనే ఫోన్ వెనక్కి ఇచ్చేయాలని ప్రయత్నిస్తే.. పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. మొదటి 12 నెలల్లోపే ఫోన్ ను రిటర్న్ చేస్తే రూ. 1500లతో పాటు జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. రెండో సంవత్సరం రిటర్న్ చేస్తే రూ. 1000 ఫైన్ తో పాటు జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. మూడవ సంవత్సరంలో రిటర్న్ చేస్తే రూ. 500 ఫైన్ తో పాటు జీఎస్టీ కట్టాలి. జియో విధించిన తాజా నిబంధనలపై వినియోగదారులు మండిపడుతున్నారు. జియో ఫోన్ అసలు స్వరూపం బయటపడిందని.. అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
