Wednesday, May 22, 2024
- Advertisement -

పరకాలను కటకటాల వెనక్కి పంపే ఛాన్స్ ఇదిగో పవన్…… పోరాటం అవసరం లేదు… ఒక్క మాటతో ఫినిష్

- Advertisement -

చిరంజీవిని మోసం చేసిన వాళ్ళకు చెప్తుతో కొట్టినట్టుగా సమాధానం చెప్తానన్న పవన్ ఆ లిస్టులో ప్రధానంగా పరకాల ప్రభాకర్ పేరు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ పరకాల ప్రభాకర్‌ని జైలుకు పంపించే బంపర్ ఆఫర్ ఒకటి పవన్ దగ్గరకు వచ్చింది. అది కూడా పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా శతృవుగా ఫీలవుతూ ఎవరిని టార్చర్ చేస్తున్నారో అతని దగ్గర నుంచే వచ్చింది. యస్…..ఆ మహేష్ కత్తినే ఇప్పుడు పవన్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో అనవసరంగా ఆవేశపడిపోయి తానే విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్న మహేష్ కత్తి ఇప్పుడు రైట్ ట్రాక్‌లోకి వచ్చాడు. పవన్‌తో పాటు పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా మహేష్ కత్తిని శతృవుగా ఫీలవుతున్నప్పటికీ ఆ మహేష్ కత్తి మాత్రం ఇప్పుడు పవన్‌కి సూపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆ మధ్య ఓ సారి పవన్ కూడా పరోక్షంగా మహేష్ కత్తిని ప్రస్తావిస్తూ ద్వేషం చల్లుతున్నాడు అని అన్న నేపథ్యంలో పవన్ కూడా మహేష్ కత్తిని శతృవుగా అనుకుంటున్నాడని భావించాల్సిందే. ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ శతృవులా భావిస్తున్న, తన అన్నను మోసం చేసిన వ్యక్తిగా చెప్తున్న పరకాల ప్రభాకర్‌ని దెబ్బకొట్టడానికి పవన్‌తో కలిసి పోరాటం చేయడానికి కూడా రెడీ ఉన్నాను అంటున్నాడు మహేష్ కత్తి. ఇందులో ప్రజా ప్రయోజనం కూడా ఇమిడి ఉండడం గమనార్హం.

చంద్రబాబునాయుడి మూడున్నరేళ్ళ పాలనలో ప్రజలకు బాగా గుర్తుండిపోయిన విషయం ఏంటి? రాజధాని గ్రాఫిక్సా? మోడీ ఇచ్చిన మట్టి, నీళ్ళా? హోదాకు మంగళం పాడడమా? ఓటుకు నోటు కేసులో ‘బ్రీఫ్డ్ మీ’ అంటూ అడ్డంగా దొరికిపోవడమా? ఇవన్నీ కూడా గుర్తుండిపోయేవే. అయితే చంద్రబాబు ప్రచార కండూతి పుణ్యమా అని పుష్కర ప్రమాదంలో దాదాపు ముఫ్పై మంది అమాయక భక్తులు చనిపోవడం మాత్రం ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. ఆ కృష్ణ పుష్కరాల కమిటీ ఛైర్మన్ పరకాల ప్రభాకరే. ఆ పుష్కర ప్రమాదానికి కారణం ఏంటో అందరికీ తెలుసు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం సోమయాజులు కమిటీ వేసి కాలం వెళ్ళదీస్తున్నాడు. చంద్రబాబు తప్పిదం ఉన్న నేపథ్యంలో ఆ కమిటీ ఇప్పట్లో రిపోర్ట్ నిజాయితీగా ఉండే అవకాశమే లేదు. అయితే ఈ పుష్కర ప్రమాదంపై పవన్ పోరాటం చేయకపోయినా…….కనీసం ధైర్యంగా మాట్లాడినా కూడా ఆ పుష్కర కమిటీ ఛైర్మన్‌గా ఉన్న పరకాల ప్రభాకర్ ఇరుక్కోవడం ఖాయం. పవన్ న్యాయ పోరాటం చేస్తే మాత్రం పరకాల వారు కటకటాల దారి పట్టినా ఆశ్ఛర్యపోవాల్సిన పనిలేదు. ముఫ్పైమంది చనిపోయిన కేసులో ఇరుక్కోవడం అంటే మామూలు విషయం కాదుగా. ఇప్పుడు మహేష్ కత్తి కూడా ఈ విషయంలో ఫైట్ చేయడానికి పవన్ ముందుకొస్తే పవన్‌తో కలిసి పోరాడడానికి నేను రెడీ అంటున్నాడు. ఇంకా చాలా మంది మేధావులు కూడా పవన్‌తో అడుగెయ్యడం ఖాయం. తన రాజ్యసభ పదవి, మంత్రి పదవి కోసం తనకు ఓట్లే సిన ప్రజలను దగా చేస్తూ నిస్సిగ్గుగా పార్టీని అమ్మేసుకున్న అన్నయ్య చిరంజీవికి ఏదో అన్యాయం జరిగిపోయిందన్న పవన్………తన అన్నయ్యను మోసం చేసిన వాళ్ళ లిస్టులో పరకాల ప్రభాకర్‌ని ప్రథమంగా చెప్పిన పవన్……..ఆ పరకాల ప్రభాకర్‌ని శిక్షించే అవకాశాన్ని వదులుకుంటాడా?

కచ్చితంగా వదులుకుంటాడు. ఎందుకంటే పవన్ మాటలన్నీ కూడా కేవలం ఆలోచనలేని అభిమానుల్లో ఆవేశం రగల్చడానికి, వాళ్ళను రెచ్చగొట్టడానికి. అంతే. పవన్ మాటలు విని వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. పవన్ మాత్రం ఎంచక్కా సినిమాకు ఇరవై కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ తన సినిమాలు తాను చేసుకుంటూ ఉంటాడు. పుష్కర కాలం తర్వాత ఇప్పుడు మూడు రోజుల షో చేశాడు. ఆ వెంటనే అజ్ఙాత వాసి సినిమాకు డబ్బింగ్ చెప్పడంలో బిజీ అయిపోయాడు. మళ్ళీ ఎప్పుడు ప్రజల మధ్యకు వస్తాడో కూడా తెలియదు. అలాంటి పవన్‌కి పౌరుషం, దమ్ము, ప్రజాసేవ అంటూ మాట్లాడే అర్హత ఉందా? నిజంగా అంత సీన్ ఉంటే ఇలాంటి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? ప్రాణాలను కూడా లెక్కచేయను అని చెప్పే పవన్ మాత్రం వదులకుంటాడు? ఎందుకంటే పవన్‌ని ఆడిస్తున్న చంద్రబాబు కూడా ఈ కేసులో ఇరుక్కుంటాడు కాబట్టి పవన్ కిక్కురుమనకుండా ఉంటాడు. చిరంజీవికి ద్రోహం చేశాడు అని పవన్ చెప్పిన పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తిని శిక్షించే అవకాశం ఉన్నా కూడా పవన్ ఎందుకు వదులుకుంటున్నాడో వేరే కారణం ఉందా? అయినా పవన్ ఎంతసేపూ పరకాల ప్రభాకర్ మీద పడతాడు కానీ ఆ పరకాల ప్రభాకర్‌ని తన బంటుగా ప్రజారాజ్యంలోకి పంపించింది ఎవరు? ఆ కృతజ్ఙతతో ఇప్పుడు తన ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి పదవి ఇచ్చింది ఎవరు అన్న విషయం పవన్‌కి తెలియదా? చాలా స్పష్టంగా తెలుసు. అయినా ఏమీ చేయలేడు? ఎందుకంటే ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు పరకాల ఎవరికైతే అమ్ముడుపోయాడో ……వాళ్ళకే ఇప్పుడు పవన్ కూడా అమ్ముడుపోయి ఉన్నాడు మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -