Tuesday, May 14, 2024
- Advertisement -

జనసేనానికి ఇంకా అర్థం కాలేదా? పవన్ ఫ్యాన్స్ కూడా ఆ ట్రాప్‌లోనే పడి కొట్టుకోవడమా?

- Advertisement -

మహేష్ కత్తి వర్సెస్ పవన్ కళ్యాణ్ వ్యవహారానికి అత్యంత డ్రమెటిక్‌గా ఫుల్ స్టాప్ పెట్టాం అని అనిపించారు. డ్రామా చివరి సీన్‌లో మహేష్ కత్తి నటన కూడా అదిరిపోయింది. అజ్ఙాతవాసిరి రిలీజ్‌కి ముందు నుంచీ రచ్చ రచ్చ చేసి……సినిమా రిలీజ్ అయ్యి…..సచ్చిపోయేవరకూ హంగామా చేసిన మహేష్ కత్తి….అజ్ఙాతవాసి పూర్తిగా చప్పబడిన వెంటనే కాంప్రమైజ్ అవ్వడం ఆశ్ఛర్యం కలిగిస్తోంది. అజ్ఙాతవాసి సినిమా హిట్టయ్యి పవన్‌కి పేరు వస్తే ఎవరికి నష్టం? పవన్ ఇమేజ్‌ని తొక్కేసే కుట్ర అమలు చేసింది ఎవరు? మహేష్ కత్తిని పావుగా వాడుకుంది ఎవరు? అత్యంత నాటకీయంగా మొత్తం వ్యవహారానికి ముగింపు పలకడానికి వెనకాల కారణాలు ఏంటి?

ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం మన కళ్ళ ముందే ఉంది. వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్‌లు పదవులకు రాజీనామా చేసి వైస్సార్ కాంగ్రస్ పార్టీ స్థాపించి ఉప ఎన్నికలకు వెళ్ళిన సమయంలో టివి9 ఎంతగా విషప్రచారం చేసిందో గుర్తుందా? నాటి నుంచీ నేటి వరకూ ఆ ఛానల్ వైఖరి ఏంటి అన్న విషయం అందరికీ తెలుసు. ఇక ఎబిఎన్ ఆంధ్రజ్యోతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్‌కి ప్లస్ అవుతుంది అనుకుంటే రాష్ట్రపతి కార్యక్రమాలను కూడా ప్రసారం చెయ్యదు. జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనకుంటే దారినపోయే దానయ్యతో కూడా గంటల పాటు ఓపెన్ హార్ట్ కార్యక్రమం చేస్తారు. మహా టీవీ స్వయానా టిడిపి ఎంపి సుజనా చౌదరిదే. ఇప్పుడు కూడా టిడిపి నేతల చేతుల్లోనే ఉంది. మహేష్ కత్తిని సూపర్ హీరోని చేసింది ఈ మీడియా ఛానల్సే. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన ఈ మీడియా ఛానల్స్ ఎందుకు ఈ ఇష్యూని రాచపుండు చేసి పవన్ ఇమేజ్ డ్యామేజ్ చేసినట్టు? సమాధానం వెరీ సింపుల్. దశాబ్ధాలుగా తన రాజకీయ జీవితానికి ఉపయోగపడిన బిజెపినే చంద్రబాబు ఎప్పుడూ సొంతంగా ఎదగనీయలేదు. అలాంటిది జనసేనను ఎదగనిస్తాడా? ఆ అవకాశమే లేదు. అందుకే ఎప్పటికైనా బాబుకో……లేకపోతే లోకేష్‌కో ప్రత్యర్థి నిలుచునే అవకాశం ఉన్న పవన్‌కి ఏ మాత్రం ఎదిగే అవకాశం లేకుండా చేయగలం అన్న హెచ్చరిక పంపడం కోసం ఆడిన డ్రామా ఇది అని తెలుసుకోలేనంత అమాయకంగా ఎవరైనా ఉన్నారా?

చంద్రబాబు వాడుకుని వదిలేస్తాడన్న విషయం నాకు తెలియదా అన్న పవన్‌కి మొదటి సినిమా అయితే చంద్రబాబు చూపించేశాడు. ఈ విషయం పవన్‌కి అయితే అర్థమైందని ………కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో పవన్ ఉన్నాడన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బాబు క్యాంప్ నుంచి బయటికి వచ్చిన మరుక్షణం చిరంజీవి చేత ‘జెండా పీకేద్దాం……’ అని అనిపించేలా బూతు రాతలు రాసిన జనాలే పవన్‌ని కూడా తొక్కెయ్యడం ఖాయం. పవన్ చుట్టూ కూడా పరకాల ప్రభాకర్ లాంటి బాబు సన్నిహితులు ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే పవన్ ఫ్యాన్స్ ముసుగులో ఉన్న టిడిపి జనాలు మాత్రం మహేష్ కత్తి వ్యవహారాన్ని వైఎస్ జగన్‌కి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్‌కి ఏ మాత్రం కలిసొచ్చే అవకాశం ఉన్నా టిడిపి భజన ఛానల్స్…..ఆ అంశానికి ఇంతటి ప్రాధాన్యతనిస్తాయా? అన్న ఒక్క ప్రశ్నకు కామన్‌సెన్స్‌తో ఆలోచిస్తే చాలు……మొత్తం విషయం అవగాహన అవుతుంది. పవన్‌కి టిడిపితో తప్పనిసరిగా పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేయడం…….పొత్తుల సమయంలో చాలా తక్కువ సీట్లు డిమాండ్ చేసేలా చేయడం కోసం చంద్రబాబు పన్నిన పవన్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే వ్యూహం ఇప్పటికైతే సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. ముందు ముందు ఇంకా ఎన్ని రాజకీయ కుట్రలు పవన్ చుట్టూ బిగుసుకుంటాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -