Friday, March 29, 2024
- Advertisement -

మొబైల్ చార్జింగ్ వెంటనే అయిపోతుందా.. అయితే ఇలా చేయండి !

- Advertisement -

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రతి ఒక్కరూ కమాన్ గా ఎదుర్కొనే మెయిన్ ప్రాబ్లం.. బ్యాటరీ తొందరగా అయిపోవడం. బ్యాటరీ కెపాసిటీ 5000mah నుంచి 6000mah కెపాసిటీ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ను తరచూ వాడడం వల్ల మ్యాక్సిమమ్ ఒక రోజుకు మించి చార్జింగ్ రాదు అని చెప్పవచ్చు. ఇక 3000mah నుంచి 4000mah మద్య బ్యాటరీ కెపాసిటీ ఉన్న స్మార్ట్ ఫోన్స్ అయితే 4గంటల నుంచి 5గంటల సమయంలోనే బ్యాటరీ చార్జింగ్ మొత్తం అయిపోతూ ఉంటుంది. దీంతో ముఖ్యంగా ప్రయాణాలు చేసే సమయంలో మొబైల్ చార్జింగ్ అయిపోతే చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు చాలా మంది. అయితే మొబైల్ లోని కొన్ని సింపుల్ ట్రిక్స్ ద్వారా కొంత బ్యాటరీ లైఫ్ ను సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ సింపుల్ ట్రిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం..!

1.ముఖ్యంగా మొబైల్ లోని ఆన్ నేససరి యాప్స్ ను ఆన్ ఇన్ స్టాల్ చేయాలి. ఎందుకంటే యాప్స్ ను వదనప్పటికి వాటికి సంబంధించిన డేటా బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూనే ఉంటుంది. దీంతో బ్యాటరీ పై ఎక్కువగా కంజూమ్ అవుతుంది. అందువల్ల మొబైల్ లో ఉన్న వాడని యాప్స్ ను డిలెట్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ మెరుగు పడే అవకాశం ఉంది.

2.సాధారణంగా మొబైల్ కొన్నప్పుడు మొబైల్ తో పాటు వచ్చే చార్జర్ కు బదులుగా వేరే చార్జర్స్ లేదా కేబుల్స్ వాడడం చేస్తూ ఉంటారు చాలా మంది. ఇలా చేయడం వల్ల బ్యాటరీ కెపాసిటీ పై ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల సాధ్యమైనంత వరకు మీరు వాడే మొబైల్ కు సంభంధించిన చార్జర్స్ మాత్రమే వాడలాని, అప్పుడే బ్యాటరీ లైఫ్ మెరుగ్గా ఉంటుందని టెక్ నిపుణులు సలహా ఇస్తున్నారు.

3.బ్యాటరీ 20% కంటే తక్కువ ఉన్నప్పటికి చాలా మంది అలాగే యూస్ చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల కూడా మొబైల్ బ్యాటరీ దెబ్బతిని చార్జింగ్ వెంటనే అయిపోతూ ఉంటుంది. అందువల్ల మొబైల్ బ్యటరి 20% కంటే తక్కువ ఉన్నప్పుడూ యూస్ చేయకూడదని టెక్ నిపుణులు చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలు స్మార్ట్ ఫోన్ యూజర్స్ పాటిస్తే.. మొబైల్ బ్యాటరీ త్వరగా పాడవ్వకుండా ఎక్కువ రోజులు బ్యాటరీ లైఫ్ వస్తుందని, మొబైల్ బ్యాటరీకి సంబంధించి చార్జింగ్ త్వరగా అయిపోవడం వంటి సమస్యలు తలెత్తవని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Also Read

ప్లాస్టిక్ కు చెక్.. సరికొత్త రోబో టెక్నాలజీ.

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పెంచే అద్బుతమైన టిప్స్ !

గూగుల్ మ్యాప్స్ లో క్రేజీ ఫీచర్ ..సూపర్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -