Sunday, May 12, 2024
- Advertisement -

కొండెక్కిన ట‌మాటో ధ‌ర‌..ఎక్క‌డ‌నుకుంటున్నారా..

- Advertisement -

కూర‌గాయ‌లు ధ‌ర‌లు ఒక్కోసారి అమాంతం పెర‌గ‌డం…త‌గ్గ‌డం సాధార‌నం.టమాటా ధరలు పెరిగితె అది అన్ని వ‌ర్గాల‌మీద తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతుంది. ఎందుకంటె ఇళ్ల‌లో ఏవంట‌కాలు వండినా ట‌మోటాలు ఉందాల్సిందె. ధ‌ర‌లు యాభ‌యో, వందో పెరిగితె ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడ‌తారు. అలాంటిది కిలో ట‌మోటాద‌ఱ ఏకంగా రూ.300 ప‌లికితె ఇంకేమ‌న్నా ఉందా. ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఎలాఉంటుందో ఉహించుకోవ‌చ్చు. ట‌మోటాలు ఏంటి రూ.300 అనుంకుంటున్నారా…? న‌మ్మ‌లేక‌పోతున్నారా…? అవును మీరు వింటున్న‌ది నిజ‌మే..అది మ‌న దేశంలో కాదులెండి పాకిస్థాన్‌లో.

పాకిస్థాన్‌లో ట‌మోటో ధ‌ర‌లు కొండెక్కికూర్చుకున్నాయి. అక్క‌డ సాధారణ పౌరుడు నిత్యవసరాల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నాడు. త‌మ రాజ‌కీయాల‌కోసం అక్క‌డి రాకీయా నాయ‌కులు భార‌త్‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్నాం…వారినుంచి నిత్యావ‌స‌రాల దిగుమ‌తుల‌ను చేసుకోం అంటూ భీష్మించుకూర్చున్నారు. అది అక్క‌డి ప్ర‌జ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది.

పాకిస్తాన్‌లోని లాహోర్‌, మరికొన్ని పట్టణాల్లో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. కిలో రూ. 300 పలుకుతుండటం సగటు పౌరుడికి మింగుడుపడనివ్వడం లేదు. దీనిపై స్పందించిన ఓ పాకిస్తానీ మంత్రి ‘ మన రైతులు ఉండగా.. విదేశీ రైతులపై ఆధారపడటం దేనికీ’ అని వ్యాఖ్యానించారు. భారత్‌ నుంచి దిగుమతులు మళ్లీ ప్రారంభించేలా చేయడానికే ఏవో దుష్టశక్తులు ఈ కుట్ర చేస్తున్నాయని అన్నారు.

ఓ సారి మంత్రిగారి తలపై ట్రక్కు టమాటాలను కుమ్మరిస్తే విషయం అర్థమవుతుంది అంటూ పత్రికలో రచయిత వ్యాఖ్యానించారు. జాతీయత పేరుతో పౌరుల కడుపు కాల్చడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. లాహోర్‌లో కిలో రూ.300 పలుకుతున్న టమాటో.. అక్కడి నుంచి 30 మైళ్ల దూరంలో ఉన్న అమృతసర్‌లో రూ.40కే దొరుకుతున్నాయని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -