Friday, May 3, 2024
- Advertisement -

గ్యాస్ లీక్ అవుతుందా.. డోంట్ వర్రీ ఇలా చేయండి

- Advertisement -

దాదాపు అన్ని మారుమూల గ్రామాల్లో కూడా గ్యాస్ తోనే వంట చేస్తున్నారు మహిళలు. అయితే ఒక్కోసారి గ్యాస్ లీకవ్వడంతో గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. కానీ కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే గ్యాస్ సిలిండర్ నుండి మంటలు వస్తున్నా సిలిండర్ పేలకుండా నియంత్రించవచ్చు. అది ఎలానో చూద్దాం.

సిలిండర్ లోపల గ్యాస్ లిక్విడ్ రూపంలో ఉంటుంది. గ్యాస్ సిలిండర్ కి మంటలు అంటుకున్నప్పుడు సిలిండర్ కి అస్సలు వేడి తగలకుండా చెయ్యాలి. గ్యాస్ సిలిండర్ కి మంటలు అంటుకున్నప్పుడు కంగారు పడి ఆ సిలిండర్ ని అటు ఇటు నెట్టివేయకూడదు, కింద పడేయకూడదు. ఆలా చేస్తే సిలిండర్ కి వేడి తగిలి పేలిపోయే ఆవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మంటలను ఆర్పాలి. ఆ తర్వాత సిలిండర్ పై ఒక గోనె సంచి వేసి నీళ్లు పోయాలి.

గ్యాస్ సిలిండర్ లీక్ అయితే, ఈ విషయాలను గుర్తుంచుకోండి
గ్యాస్ వాసన వస్తే, భయపడవద్దు. వంటగదిలో.. ఇంట్లో ఉన్న విద్యుత్ స్విచ్‌లను ఆన్ చేయవద్దు.
వంటగది, ఇంటి కిటికీలు, తలుపులు తెరవండి.
రెగ్యులేటర్ ఆన్‌లో ఉందో లేదో తనిఖీ చేయండి. ఒకవేళ ఆన్ లో ఉంటె వెంటనే దాన్ని ఆఫ్ చేయండి.
రెగ్యులేటర్‌ని ఆపివేసిన తర్వాత కూడా రెగ్యులేటర్‌ని తీసి సేఫ్టీ క్యాప్ ని పెట్టండి.
నాబ్‌ను కూడా బాగా తనిఖీ చేయండి.
వెంటనే మీ డీలర్‌ను సంప్రదించి, పరిస్థితిని గురించి అతనికి తెలియజేయండి. తద్వారా అతను మీకు త్వరగా చేరుకోవచ్చు.
గ్యాస్ లీక్ కాకుండా చూసుకోవడానికి.. రెగ్యులేటర్ అదేవిధంగా గ్యాస్ పైపును ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. పైపు కొంచెం చెడిపోయినట్లయితే, వెంటనే దాన్ని మార్చండి.
విక్రేత నుండి గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నప్పుడు.. దానిని పూర్తిగా తనిఖీ చేయండి. ఒకవేళ అది లీక్ అవుతుంటే దాన్ని అప్పుడే దానిని మార్చమని కోరండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -