Sunday, May 5, 2024
- Advertisement -

ట్విట్టర్‌లో జగన్, ఢిల్లీలో విజయమ్మ స్పందన….. బాబు బ్యాచ్‌కి జ్ఙానోదయమైందా?

- Advertisement -

వైకాపా ఎంపీల రాజీనామాలు ఆమోదించకపోతే మోడీ-జగన్ మధ్య కుమ్మక్కు నిజమే అని జగన్ ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ వైకాపా ఎంపిల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే మోడీతో జగన్ కుమ్మక్కయ్యాడన్న విషయం ఇంకా స్పష్టంగా జగన్ ఒప్పుకోవాల్సిందే. ఇదీ ఈ వారం వీకెండ్ కామెంట్‌లో రాధాకృష్ణ చెప్పిన సిధ్ధాంతం. విభజన నాడు కూడా పచ్చ బ్యాచ్ సిద్ధాంతం ఇదే. రాష్ట్ర విభజనకు ఒకే అని జగన్ అంటే అదిగో……కేసిఆర్, సోనియాలతో కుమ్మక్కయ్యాడంటారు. అలా కాదని సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్ష చేస్తే …..కెసీఆర్, సోనియాతో జగన్ కుమ్మక్కు ఇంకా స్పష్టంగా అర్థమైపోయిందంటారు. ఇక ఆ తర్వాత రంకెలేస్తారు, కేకలేస్తారు, రణరంగం సృష్టిస్తారు……అబద్ధాలతో కొంతమందిని అయినా నమ్మిస్తారు. నమ్మించారు కూడా. కానీ ఇప్పుడు కెసీఆర్‌తో ఎవరు కుమ్మక్కయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన విభజన ప్రయోజనాలను పూర్తిగా తాకట్టేపెట్టేశారో, హైదరాబాద్‌పై పదేళ్ళ హక్కును కెసీఆర్ కోసం ఎవరు వదులుకున్నారో అందరికీ స్పష్టంగా తెలుస్తూనే ఉంది.

ఇక 2019 కోసం ఈ సారి మోడీతో జగన్ కమ్ముక్కు అనే పాట మొదలెట్టారు పచ్చ బ్యాచ్. లోపాయికారిగా కాంగ్రెస్‌తో, కెసీఆర్‌తో చంద్రబాబు సంబంధాలు నెరుపుతున్నారు కాబట్టి ఇక వాళ్ళిద్దరితో జగన్ కుమ్మక్కు అని అనరు. అలాగే కెసీఆర్, సోనియా, రాహుల్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అభిమానం పెల్లుబుకుతోంది అని కూడా ప్రచారం చేస్తారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోడీపైన పీకల వరకూ కోపం ఉందన్నది నిజం. అందుకే ఆ కోపాన్ని జగన్‌కి కూడా అంటించడానికి మోడీతో కుమ్మక్కయిన జగన్ అని ప్రచారం చేస్తున్నారు. వైకాపా నేతలు కనీసం మోడీ పేరు ఎత్తగలరా అని నిన్నటి వరకూ ఒకటే విమర్శలు చేశారు. తాజాగా ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్న వైకాపా ఎంపీలను పరామర్శించిన విజయమ్మ మోడీ పేరు డైరెక్ట్‌గా ప్రస్తావిస్తూ విమర్శలు చేసింది. 2014లో ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేసింది. ఇక జగన్ కూడా ట్విట్టర్‌లో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చెప్పి మోడీని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో డిమాండ్ చేశాడు.

రీసెంట్‌గా ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు నాయుడు నేషనల్ మీడియాతో మాట్లాడేటప్పుడు మాత్రం మోడీపై విమర్శలు చేయకుండా జాగ్రత్తపడ్డాడు. తెలుగు మీడియా మాట్లాడేటప్పుడు రెచ్చిపోయాడు. కానీ జగన్ మాత్రం డైరెక్ట్‌గా ట్విట్టర్‌లో మోడీని ట్యాగ్ చేస్తూ స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశాడు. ఇక ఇప్పుడు కూడా జగన్‌తో మోడీ కుమ్మక్కు అనే పుక్కిటి పురాణాలను, అబద్ధాలను బాబుతో పాటు శివాజీలాంటి ఆయన బ్యాచ్ వినిపించగలరా? అయినా జగన్ కేసుల్లో జగన్‌కి శిక్ష పడే అవకాశమే ఉంటే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు సైలెంట్‌గా ఉండేవాడా? అలాంటి పసలేని కేసులకు భయపడి పదేళ్ళుగా అహర్నిశలూ ప్రజల మధ్యే ఉంటూ పెంచుకున్న ప్రజాబలాన్ని తాకట్టుపెట్టి మోడీ గెలుపు కోసం తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టుకుంటాడా జగన్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -