Wednesday, May 15, 2024
- Advertisement -

క్లీన్‌స్వీప్ స‌రే.. అభ్య‌ర్థుల మాటేమిటీ?

- Advertisement -

దేశంలో మోస్ట్ సీనియ‌ర్ పొలిటిషియ‌న్.. అదేనండి ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు పాల‌న వైఫ‌ల్యాలో లేక‌.. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ఎఫెక్టో ఏమో తెలీదు కానీ .. ఏ స‌ర్వే రిపోర్ట్ చూసిన ఇప్పుడు ఏపీలో అధికారం వైఎస్ఆర్‌సీపీదే అని క‌నిపిస్తుంది.. వినిపిస్తుంది. ఇక లోక్‌స‌భ ఎన్నిక‌లు ఎప్పుడు నిర్వ‌హించినా వైఎస్ఆర్‌సీపీ 20 సీట్ల‌కు పైగా గెలుచుకుంటుంద‌ని అన్ని స‌ర్వేలు ఘంటాప‌థంగా చెబుతున్నాయి. తాజాగా గురువారం నేష‌న‌ల్ అప్రూవ‌ల్ రేటింగ్స్ పేరిట‌ రిప‌బ్లిక్ టీవీ-సీ ఓట‌ర్ విడుద‌ల చేసిన స‌ర్వే కూడా వైఎస్ఆర్‌సీపీ 19 ఎంపీ సీట్లు గెలుచుకుంటుంద‌ని జోస్యం చెప్పింది. ఈ స‌ర్వేలు టీడీపీ క్యాంప్‌లో ఒకింత క‌ల‌వ‌రం సృష్టిస్తున్నాయ‌నే చెప్పాలి.

మ‌రోవైపు ఈ స‌ర్వే ఫ‌లితాలు వైఎస్ఆర్‌సీపీ క్యాంప్‌లో ఆనందాన్ని నింపుతున్నా.. అది మాత్రం సంతృప్తిగా లేద‌ని టాక్ వినిపిస్తుంది. గెలుస్తాం స‌రే.. మ‌రి అభ్య‌ర్థులు ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు నేత‌ల మ‌దిలో మెదులుతున్న ప్ర‌శ్న‌. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామా చేసిన ఐదుగురు ఎంపీలు త‌ప్ప‌.. మిగిలిన 20 ఎంపీల స్థానాల్లో పోటీ చేసేదేవ‌రో ఇంత వ‌ర‌కు క్లారిటీ రాలేదు. ఆ ఐదుగురు ఎంపీలకు కూడా మ‌ళ్లీ పోటీ చేసే అవ‌కాశం వ‌స్తుందో రాదో కూడా తెలియ‌దు. రాజీనామాలు ఆమోదం పొందాక‌.. హోదా పోరాటాన్ని ఢిల్లీ నుంచి ఏపీకి షిఫ్ట్ చేసిన ఎంపీలు… ప్ర‌స్తుతం తెర‌మ‌రుగయ్యారు. మాములుగానే వైఎస్ఆర్‌సీపీ నేత‌ల‌ను ఏ మీడియా కూడా అంతగా ప‌ట్టించుకోదు.. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని రిలాక్స్ అవుతున్నారో లేదో.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు గ్రౌండ్ వ‌ర్క్ చేసుకుంటున్నారో తెలియ‌దు కానీ.. ప్ర‌స్తుతానికి జ‌గ‌న్ పేరు త‌ప్ప మీడియాలో ఆ పార్టీలో వేరే ఏ పేరు వినిపించ‌దు. (ఎంపీ విజ‌య‌సాయి రెడ్డికి మాత్రం మిన‌హాయింపు).

2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అర‌కు పార్ల‌మెంట్ స్థానం మిన‌హా వైఎస్ఆర్‌సీపీ గెలిచిన ఎంపీ స్థానాల‌న్ని రాయ‌ల‌సీమ‌.. దాని స‌రిహ‌ద్దు ప్రాంతాల్లోనివే. 2019 ఎన్నిక‌ల్లో కూడా జ‌గ‌న్‌కు రాయ‌ల‌సీమ అభ్య‌ర్థుల ఎంపిక‌లో పెద్ద స‌వాల్లేమి ఎదురుకావ‌నే అనిపిస్తుంది. కానీ కుల రాజకీయాల‌తో కొట్టుమిట్టాడే ఆంధ్రాలో జ‌గ‌న్ క్యాలుక్యేష‌న్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి.. అభ్య‌ర్థుల ఎంపిక ఏవిధంగా ఉండ‌బోతుంది అనేది వేచి చూడాల్సిందే. గెలుపుపై అనుకూల ప‌వ‌నాలు వీస్తున్న స‌మ‌యంలో.. ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న నేత‌ల్లో అధికారంపై కోరిక పుట్ట‌డం మాములు విష‌య‌మే. గెలుపు టికెట్ ఆశించి ద‌క్క‌క‌పోతే వారు ఆ అభ్య‌ర్థి గెలుపుకు స‌హ‌క‌రిస్తారా? లేదా త‌మ‌కు టికెట్ ద‌క్క‌లేద‌న్న ఆక్రోషంతో ఓట్ల‌ను చిల్చే ప్ర‌య‌త్నం చేస్తే స‌ర్వేలు చెప్పిన‌ట్టు వైఎస్ఆర్‌సీపీకి ఉన్న 41.3 శాతం ఉంటుందా? అనే ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. ఇలాంటి అవ‌కాశం ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని కాచుకొని కూర్చునే టీడీపీ.. అసంతృప్తుల‌ను వంగ‌వీటి రాధాలా త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుంటే మాత్రం వైఎస్ఆర్‌సీపీకి మాత్రం మ‌రో చావు దెబ్బ మాత్రం త‌ప్ప‌దు! ఏదేమైనా ఎంపీ అభ్య‌ర్థుల విష‌యంలో వైఎస్ఆర్‌సీపీ సైలెంట్‌గా వ‌ర్క్ చేస్తుందా? లేదా మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తుందా అనేది త్వ‌ర‌లో తేల‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -