Thursday, March 28, 2024
- Advertisement -

పిల్లల్లో వచ్చే కరోనా వైరస్ ప్రారంభ లక్షణాలు ఇవే?

- Advertisement -

భారతదేశంలో కరోనా రెండవ దశ తీవ్రస్థాయిలో విజృంభించగా ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం నుంచి కోలుకుంటుంది. ఈ క్రమంలోనే కరోనా సరికొత్త వేరియంట్లలో రూపాంతరం చెంది థర్డ్ వేవ్ రూపంలో చిన్న పిల్లల పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది అని ఇప్పటికే పలువురు నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు సైతం మూడవ దశను ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. అయితే చిన్నపిల్లలలో కరోనా వ్యాప్తి చెందితే ఏ విధంగా గుర్తించాలి.. వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో నిపుణులు తెలియజేశారు.

కరోనా వైరస్ మూడవ దశలో పిల్లల పై తీవ్రమైన ప్రభావం చూపించింది.ఈ క్రమంలోనే తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. సాధారణంగా పిల్లల్లో కూడా covid 19 లక్షణాలు పెద్ద వారి మాదిరిగానే గొంతు నొప్పి, దగ్గు, ఎక్కువ శ్వాసకోస వాపును కలిగి ఉంటుంది. మరి కొందరి పిల్లలలో ముక్కు కారటం, వాసన కోల్పోవటం వంటి లక్షణాలు కూడా ఉంటాయి.

Also read:హీరో రామ్ కొత్త స్టోరీ.. వినకుండానే ఒకే చేసాడట!

కొన్నిసార్లు సాధారణ జలుబులో కూడా ఈ విధమైనటువంటి లక్షణాలు ఉండటం పట్ల తల్లిదండ్రులు తీవ్ర అయోమయ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరిలో విరోచనాలు, కళ్ళు ఎర్రబడటం, చర్మంపై దద్దుర్లు ఏర్పడటం, చలి, జ్వరం వంటి మొదలైన లక్షణాలు కనబడతాయి.ఇలాంటి లక్షణాలు కనబడితే తల్లిదండ్రులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పిల్లలకు సరైన చికిత్సలు చేయించటం వల్ల పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

Also read:కియారా అద్వానీకి ట్రిపుల్ ధమాకా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -