Sunday, May 12, 2024
- Advertisement -

జగన్ పాదయాత్ర సూపర్ హిట్ః టిడిపి, ఎల్లో మీడియా ఒప్పుకోలు

- Advertisement -

ఓట్ల లెక్కలను మేనేజ్ చేయడంలో సక్సెస్ అయిన చంద్రబాబు, బూత్ మేనేజ్‌మెంట్ కింగ్ అయిన చంద్రబాబు అధికారంలోకి వస్తే వచ్చి ఉండొచ్చు కాక…… కానీ ప్రజాదరణ విషయంలో మాత్రం ఎప్పుడూ వైఎస్‌ల ముందు చంద్రబాబు దిగదుడుపే అన్నది నిజం. అయితే లోపాయకారి రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, కుమ్మక్కు రాజకీయాలు చేయడంలో మాత్రం చంద్రబాబుకు సాటిరాగల నేత మరొకరు కనిపించరు. ప్రపంచానికి పాఠాలు చెప్పా అని తన గురించి తానే చెప్పుకునే చంద్రబాబు…… ఆ ప్రపపంచానికి చెప్పిన పాఠాలు ఇవే అయి ఉంటాయి. అయితే 2019 ఎన్నికల్లో కూడా పోల్ మేనేజ్‌మెంట్‌తోనూ, జగన్‌పై విషం కక్కుతూ విజయం సాధించగలడా? ఆ విషయం తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం జగన్ పాదయాత్ర టిడిపి నేతలు, ఎల్లో మీడియా అధినేతల గుండెల్లో గుబులు రేపుతోంది. జగన్‌కి వస్తున్న ప్రజాదరణను తగ్గించడం ఎలా అని అహర్నిశలూ వ్యూహాలు రచిస్తున్నారు, కుట్రలు పన్నుతున్నారు.

నిజానికి 2014ఎన్నికలకు ముందే జగన్‌కి వ్యతిరేకంగా ఏమేం చేయాలో అన్నీ చేసేశారు. ఇక ఇప్పుడు కొత్తగా జగన్ చేసిన తప్పులను, జనాలను నమ్మించేలా జగన్‌పై వ్యతిరేక వార్తలు రాయడానికి కానీ టిడిపితో పాటు ఎల్లో మీడియా దగ్గర కూడా సరుకులేదు. అందుకే పాత అస్త్రాలనే మరోసారి బయటకు తీస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం జనాలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో కూడా నోరు జారి జగన్ మాట్లాడిన మాటలను బాగానే క్యాష్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న సమయంలో మాత్రం జగన్ అలాంటి అవకాశం అస్సలు ఇవ్వడం లేదు. అన్నింటికీ మించి ప్రభుత్వ వైఫల్యాలను, చంద్రబాబు మోసపూరిత వ్యక్తిత్వాన్ని ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పడంలో జగన్ సక్సెస్ అవుతున్నాడు. అదే టిడిపి నేతల్లో గుబులు రేపుతోంది. వ్యూహాలకు పదును పెట్టేలా చేస్తోంది.

వైఎస్‌లకు సంబంధించిన ప్రతి విషయాన్నీ జనాలకు వ్యతిరేకంగా చూపించడంలో ఇప్పటివరకూ అయితే ఎల్లో మీడియా బాగానే సక్సెస్ అయింది. మరీ ముఖ్యంగా వైఎస్‌లు క్రిష్టియన్ మతం పుచ్చుకున్నారు కాబట్టి హిందువులకు వ్యతిరేకం అని గట్టి ప్రచారం చేశారు. ఇప్పటికీ కూడా జగన్ ముఖ్యమంత్రి అయితే మొత్తం హిందూ మతానికే ఏదో అయిపోతుందని చెప్తూ ఉంటారు టిడిపి జనాలు. అయితే వైఎస్ జగన్ హిందూత్వాన్ని పూర్తిగా విశ్వసిస్తాడన్న నిజం మాత్రం ఆయనతో సన్నిహితంగా తిరిగే మీడియా మితృలకు తెలుసు. ఈ విషయంలో జగన్‌కి ఛాదస్తం కూడా ఉందని జోకులు కూడా వేసుకుంటూ ఉంటారు. వాస్తుతో సహా అన్ని రకాల సెంటిమెంట్లూ జగన్‌కి బలంగా ఉన్నాయన్నది నిజం. ఇక జగన్‌ అవినీతిపై ఇప్పటికే చాలా చర్చలు చేశారు. అయితే సిబిఐ, ఈడీలు కూడా సాక్ష్యాధారాలు చూపించడానికి మాత్రం ఇఫ్పటికే ఆరేళ్ళ సమయం తీసుకున్నాయి. కానీ నిరూపించింది కూడా ఏమీ లేదు. నిన్నటికి నిన్న చంద్రబాబు, ఎల్లీ మీడియా మొత్తం కూడా టాప్ అవినీతిపరుడుగా జగన్‌ని చూపిస్తూ మూడు వందల కోట్ల లెక్కలు ఏవో తీశాయి. ఇంగ్లీష్ పెయిడ్ మీడియాలో ఆర్టికల్ రాయించి …..ఆ ఆర్టికల్‌ని ఆధారంగా చూపిస్తూ ఎల్లో మీడియా రంకెలు వేసింది. ప్లాన్ ప్రకారం చంద్రబాబుతో సహా టిడిపి నేతలు కూడా అరిచి గోల చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆధారాలు లేకుండా అబద్ధాలు చెప్పడం మాత్రం ఆశ్ఛర్యపరుస్తోంది. జగన్ అవినీతి గురించి మాట్లాడే చంద్రబాబుకు ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడే ధైర్యం ఉందా? బ్రీఫ్డ్ మీ వాయిస్ తనది కాదు అని చెప్పగలడా? 2014 తర్వాత నుంచీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ప్రభుత్వ సంస్థ కాగ్ కూడా తేల్చింది.

అలాగే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ ఒన్‌గా నిలిచింది. ఆ విషయం ఎల్లో మీడియాలో కూడా వచ్చింది. ఆ విషయాలపై చంద్రబాబు మాట్లాడగలరా? 2014 ఎన్నికలకు ముందు, కడప ఎన్నికల సమయంలో చెప్పిన అవినీతి కహానీలు ఇప్పుడు మరోసారి ఇంగ్లీష్ మీడియా పేరు అడ్డుపెట్టుకుని చెప్తున్నారంటే అర్థమయ్యేది ఒక్కటే జగన్ పాదయాత్ర సూపర్ హిట్ అన్న విషయం టిడిపి జనాలకు అర్థమైపోయింది అని. ఈడీ అధికారిక వెబ్‌సైట్‌లో చెప్పిన సమాచారం ఏమీ లేదు. ఈడీకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ ఏమీ చెప్పలేదు. అయినప్పటికీ ఎల్లో మీడియా, టిడిపి జనాలు మాత్రం జగన్ పాదయాత్రకు వస్తున్న ప్రభంజనాన్ని తగ్గించాలని ఈడీ పేరుతో భలే నాటకం ఆడారు. అయితే ఆ నాటకం అట్టర్ ఫ్లాప్ అయింది. అవినీతి పరుల జాబితాలో తన పేరు ఉన్నట్టు నిరూపిస్తే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని జగన్ ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్‌కి కనీసం స్పందించే దమ్ము చంద్రబాబుకు లేదు. అలాగే జగన్ ఛాలెంజ్ చేసినట్టుగా చంద్రబాబు ఛాలెంజ్ చేయగలడా? బ్రీఫ్డ్ మీ వాయిస్ చంద్రబాబుదే అని నిరూపిస్తే రాజీనామా చేసి రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని చెప్పగలడా? చంద్రబాబు నుంచి ఆ స్థాయి ధైర్యాన్ని ఎప్పుడూ చూడలేం. అంతా కూడా తెరవెనుక వ్యవహారాలే.

అయితే ఇప్పటి వరకూ చాలాసార్లు సక్సెస్ అయిన బాబు అండ్ కో…..ఈ సారి ఈడీ పేరుతో ఆడిన డ్రామా మాత్రం సూపర్ ఫ్లాప్ అయింది. జగన్ పాదయాత్ర సూపర్ సక్సెస్ అవుతోందన్న నిజాన్ని కూడా జనాల కళ్ళకు కట్టింది. అంతకుముందు వరకూ పాదయాత్రని పెద్దగా ఫాలో అవ్వని జనాలు కూడా నిన్న మాత్రం గూగుల్‌లో జగన్ పాదయాత్ర గురించి సెర్చ్ చేశారు. పాదయాత్ర రెస్పాన్స్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ రకంగా చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా చేసిన ఈడీ షో కాస్తా జగన్‌కే ప్లస్ అయింది. ఇకపైన అయినా ఇలాంటి కుట్రపూరిత వ్యూహాలను మరింత పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటే బెటర్ ఏమో. అసలే ఒక రాజగురువు, ఇంకో జర్నలిస్ట్‌గానే కాక…మనిషిగా కూడా ఏ విలువలూ లేని మీడియా అధినేతతో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు రచించే వ్యూహాలు కదా……..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -