గాలి జనార్ధనరెడ్డి కూతురి పెళ్లి ఈ నెల 16న ఏ రెంజ్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహంకు రూ.500 కోట్ల వరకు ఖర్చయినట్టు తెలుస్తున్నా… అనధికారిక లెక్కల ప్రకారం ఈ పెళ్లికి రూ.1000 కోట్ల వరకు ఖర్చుయినట్టు టాక్ వినిపిస్తోంది.
పెద్ద నోట్ల రద్దుతో జనాలు ఎన్ని తిప్పలు పడినా గాలి కూతురు పెళ్లి మాత్రం కళ్లు చెదిరే రీతిలో జరిగింది. జాతీయ మీడియాలో సైతం ఈ పెళ్లి పెద్ద చర్చనీయాంశమైంది. ఈ పెళ్లినే తలదన్నేలా ఇప్పుడు మరో పెళ్లి అదే కర్నాటక రాష్ట్రంలో జరుగబోతోంది. అయితే ఈ పెళ్లి ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మంత్రి కొడుకుది కావడం గమనార్హం. కర్ణాటకలోని చిన్నతరహా పరిశ్రమల మంత్రి రమేష్ జర్కిహొలి తన కొడుకు సంతోష్ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయబోతున్నారు.
ఈ పెళ్లి కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పెళ్లి కోసం రెండు ఎకరాల్లో మండపం నిర్మించారు. ఈ పెళ్లి గోకక్ పట్టణంలో ఆదివారం జరగబోతోంది. పట్టణమంతా మంత్రి కొడుకు పెళ్లికి సంబంధించిన ఆహ్వాన బ్యానర్లు, కటౌట్లతో ముస్తాబైంది. దాదాపు లక్ష మందికి పైగా ఈ పెళ్లికి హాజరవుతున్నారు. ఇందుకు సంబంధించి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక పెళ్లి మండపం అంతా ఎయిర్ కండీషన్లతో నింపేశారు. పట్టణ శివార్లలో వీవీఐపీల హెలికాఫ్టర్ల కోసం హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. పెళ్లి మండపాన్ని కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి ఆలయం మాదిరిగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పెళ్లికి పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు, ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక నిన్నటి వరకు గాలి కూతురు పెళ్లిని కాంగ్రెస్ నేతలు టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తే, ఇప్పుడు ఈ పెళ్లిని బీజేపీ నేతలు టార్గెట్‌గా చేసుకునే ఛాన్స్ ఉంది.
Related
