Friday, March 29, 2024
- Advertisement -

హీరోయిన్లకు సాటి హీరోయిన్లు గాత్ర దానం చేసిన వారు వీళ్లే..!

- Advertisement -

నటన అంటే కేవలం ముఖాభినయం మాత్రమే కాదు. పాత్ర స్వభావాన్ని, భావాలను తన గొంతుతో పలికించడం అవసరం. ఇతర భాషా నటీనటులు తెలుగు​ చిత్రాల్లో​ నటించినప్పుడు వారికి మరొకరు డబ్బింగ్ చెప్పడం పరిపాటి. అయితే ఆ పాత్రకు​ ప్రాణం పోసేందుకు ఒకోసారి సాటి నటీనటులు కూడా డబ్బింగ్ కళాకారులుగా మారారు. ముఖ్యంగా హీరోయిన్లకు సాటి హీరోయిన్లు గాత్ర దానం చేసి ఆ పాత్రలకు జీవం పోశారు. అలాంటి ఐదుగురు నటీమణులు ఇక్కడ..

సరిత – సౌందర్య
నటిగా కెరీర్ మొదలు పెట్టి, అదే సమయంలో డబ్బింగ్ కళాకారిణిగానూ మారారు సరిత. ‘మరో చరిత్ర’, ‘కోకిలమ్మ’ తదితర చిత్రాలతో తెలుగులో గుర్తింపు పొందిన ఆమె దాదాపు ఆ కాలంలోని అందరు తెలుగు హీరోయిన్లకూ డబ్బింగ్ చెప్పారు. ప్రత్యేకించి ‘పవిత్రబంధం’, ‘అంతఃపురం’ చిత్రాల్లో నటి సౌందర్య పోషించిన పాత్రలకు ఆమె డబ్బింగ్ ప్రాణం పోసింది. అంతఃపురం, మా ఆయన బంగారం​ సినిమాలకుగాను రెండుసార్లు ఉత్తమ డబ్బింగ్ కళాకారిణిగా నంది పురస్కారాలు అందుకున్నారు.

భానుప్రియ – ఊర్మిళ
నటి భానుప్రియ కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పిన సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్'(తెలుగులో ‘భారతీయుడు’) చిత్రంలో నటి ఊర్మిళకు ఆమె డబ్బింగ్ చెప్పారు. రెండు భాషల్లోనూ ఆమే తన గాత్రం ఇవ్వడం విశేషం.

ఛార్మి – కాజల్
తెలుగులో​ ఒక టైంలో​ టాప్ హీరోయిన్‌గా ఉన్న ఛార్మి తెలుగు నేర్చుకుని తన సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. అంతే కాకుండా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ’ సినిమాలో కాజల్‌కు తన గొంతు అందించారు.

ఉదయభాను – ఛార్మి
కాజల్‌కు ఛార్మి డబ్బింగ్ చెప్పడం ఒక విశేషమైతే, ఛార్మికి ఒక సినిమాలో యాంకర్ ఉదయభాను డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తెలుగులో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో ఛార్మికి డబ్బింగ్ చెప్పారు.

ఝాన్సీ – టబూ
నటిగా, యాంకర్‌గా తెలుగువారికి సుపరిచితమైన ఝాన్సీ కొన్ని సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు​. చంద్రసిద్ధార్థ దర్శకత్వంలో వచ్చిన ‘ఇదీ సంగతి’ చిత్రంలో​ నటి టబూకు గాత్రదానం చేశారు.

స్వాతి – ఇలియానా
యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి ఆపై నటిగా మారిన స్వాతి ఒకే ఒక్క హీరోయిన్‌‌కి డబ్బింగ్ చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘జల్సా’ సినిమాలో ఇలియానాకు తన గొంతు ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -