Friday, March 29, 2024
- Advertisement -

ల‌క్ష్మ‌ణుడు గురించి ఎవ్వ‌రికి తెలియ‌ని నిజాలు …!

- Advertisement -

మ‌న దేశంలో దేవుళ్లకు చాలా ప్రాముఖ్య‌త‌‌ను ఇస్తారు. ఎవ‌రికి న‌చ్చిన దేవుడిని వారు కొలుస్తుంటారు. హిందూ మ‌తంలో అయితే రాముడిని ఎక్కువుగా కొలుస్తారు. ఏ భార్యకు అయిన రాముడు లాంటి భ‌ర్త రావాల‌ని కోరుతారు. అలాగే అన్న‌ద‌మ్ములు అయితే రాముడు- ల‌క్ష్మ‌ణడులా క‌లిసి మెలిసి ఉండాలని అనుకుంటున్నారు. కాని అలాంటి ల‌క్ష్మ‌ణుడు గురించి ఎవ్వ‌రికి తెలియ‌ని విషయాలు కొన్ని పురాణ‌ల‌లో నిక్షిప్తం చేసిన‌ట్లు తెలుస్తుంది.

14 సంవత్సరాల వనవాసం త‌రువాత సీతారాములు, లక్ష్మణ, హనుమలు అయోధ్య రాజ్య‌నికి చేరుకున్నారు. వనవాసం పూర్తిచేసుకుని అయోధ్యకు క్షేమంగా చేరిన నేపథ్యంలో సీతా సరయు నదీ తీరానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. తోడు కోసం రాజ్యపాలనలో ఉన్న శ్రీరామునికి అంతరాయం కలుగకుండా, లక్ష్మణుని తనకు తోడుగా రావాలని సహకారం కోరింది. లక్ష్మణుడు తోడుగా రాగా, సీతా దేవి సరయు నదికి చేరుకుంది. తాను కూడా తోడుగా వస్తాన‌ని హ‌నుమంతుడు కోరుగా.. అత‌నిని వ‌ద్ద‌ని వారించింది సీతా. అనుమానం వ‌చ్చి హ‌నుమంతుడు వారికి తెలియ‌కుండా కాప‌లాగా వెళ్లాడు. సీతా లక్ష్మణులు ఆ స్థలానికి చేరుకున్న పక్షంలో, హనుమంతుడు నదికి సమీపంలోని ఒక చెట్టు వెనుకగా ఇరువురికి కనపడకుండా దాక్కుని పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ఆ స‌మ‌యంలో లక్ష్మణుడి మీదకు భయంకరంగా నవ్వుతూ నది నుండి ఒక రాక్షసుడు హూంకరిస్తూ ముందుకు దూకాడు.

తపస్సు ఫలితంగా శివుని వర ప్రసాదాన్ని పొందిన ఆ రాక్షసుడు తనను చంపడం వీలు కాదన్న గర్వంతో లక్ష్మణుడిని లక్ష్యంగా చేసుకుని, అతన్ని మింగివేయాలని ప్రయత్నించాడు. అత‌ను ఎవ‌రో కాదు అఘాసురుడు. ఇత‌ను రాక్ష‌స జాతిలోనే దుర్మారుగుడు. అఘాసురుడు చాలా కాలంగా అదే నదిలో ఉంటూ చుట్టు పక్కల ప్రజలను వేధిస్తూ ఉండేవాడు. అదే క్రమంలో భాగంగా లక్ష్మణుడిని కూడా మింగాలని ప్రయత్నించాడు. ఇది గ‌మ‌నించిన ల‌క్ష్మ‌ణుడిని కాపాడ‌టానికి వ‌చ్చిన సీతా దేవి, తన దైవ శక్తులతో తానే లక్ష్మణుడిని మింగివేసింది. హనుమంతుడు సైతం ఆశ్చర్యపోయేలా, ఒక వెలుగులు విరజిమ్మే దైవిక వస్తువుగా రూపాన్ని సంతరించుకుని నిలబడింది సీతా దేవి. అఘాసురుడి నుండి కాపాడే ప్రయత్నంలో భాగంగా, హనుమంతుడు ఆ వస్తువును కాలాష్ నది నీటితో గుండ్రటి బంతి వలె మార్చి, రాక్షసుని నుండి తప్పించాడు. అక్క‌డ జ‌రిగిన విష‌యాన్ని రాముడికి పూస గుచ్చిన‌ట్లు తెలియ‌జేశాడు. రామునికి పూర్తిగా వివరించిన హనుమంతుడు, వారిరువురిని తిరిగి మానవ రూపం దాల్చేలా వరమివ్వమని ప్రార్ధించగా, సీతా లక్ష్మణులు కేవలం మనుషులు మాత్రమే కాదని, దైవిక అవతారాలు అని హనుమంతునికి వివరించాడు.

రాముని ఆదేశాల ప్రకారం, హనుమంతుడు ఆ కాలాష్ నదిలోకి నీటిని తిరిగి కురిపించగా, ఆ దైవిక వస్తువు ఒక భారీ నిప్పు బంతి వలె మారి, ఆ మంటలతో అఘాసురుని అంతమొందించడం జరిగింది. అఘాసురుడు మ‌ర‌ణంతో మ‌ళ్లీ ఆ ప్రాంతం సురక్షితమైన ప్రాంతంగా మారడంతో పాటు, సీతా దేవి, లక్ష్మణులు వారి వారి అసలు రూపాలను తిరిగి పొందారు. కష్టాలలో ఉన్న ప్రజలను కాపాడుటం కోస‌మే సీతాదేవి ఇలా వ్యూహాత్మకంగా వ్య‌వ‌హ‌రించింది. సీతారాములు, లక్ష్మణ, హనుమల సహాయంతో రాజ్యాన్ని కంటికిరెప్పలా కాపాడేవారని చెప్పకనే చెబుతుంది ఈ కథనం. అందుకే ఎన్నియుగాలైనా, వీరి చరిత్ర అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -