Friday, May 3, 2024
- Advertisement -

విశాఖ ఎంపి సీటుకి వందకోట్లా…… ఆశావహులకు వేలం పాట పెట్టేశారా?

- Advertisement -

2014 ఎన్నికల్లో చంద్రబాబు, మోడీ, పవన్‌ల పొత్తు పుణ్యమాని విశాఖ నుంచి భాజపా పార్టీ అభ్యర్థి ఎంపిగా గెలిచాడు. అయితే ఆ తర్వాత మాత్రం ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. రైల్వేజోన్‌తో సహా అన్ని విషయాల్లోనూ విశాఖ ప్రజలను నిండా ముంచారు. మోడీ ఇచ్చిన హామీలు, బాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు. అయినప్పటికీ విశాఖకు ఏదో జరిగపోతోంది………భవిష్యత్ అంతా అద్భుతాలే అని పేరు గొప్ప ప్రచారం చేయించే ప్రయత్నంలో మాత్రం చంద్రబాబు సక్సెస్ అవుతూ ఉన్నాడు. అందుకే 2019 ఎన్నికల్లో కచ్చితంగా టిడిపినే గెలుస్తుందని ఇక్కడ టిడిపి నాయకులు నమ్ముతారు. ఆ నేపథ్యంలోనే విశాఖ ఎంపి సీటుకు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది.

బాలకృష్ణకు బంధువుల కుటుంబం నుంచి, ఇక వైకాపాలో ఉండి ఇప్పుడు టిడిపికి మద్దతు పలుకుతున్న మాజీ ఎంపి ఒకరు, టిడిపి సీనియర్ నేత, పారిశ్రామక వేత్త ఒకరు ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. ఈ నలుగురితో పాటు మరికొందరు పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. విశాఖలో రియల్ ఎస్టేట్ దందా ఈ నాలుగేళ్ళలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తూ ఉండడం, పారిశ్రామక నగరం కావడంతో డబ్బులు ఓ స్థాయిలో సంపాదించుకోవచ్చని ఈ నేతలు అనుకుంటున్నారు. అందుకే టికెట్ కోసం గట్టిప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టిడిపి అధిష్టానం నుంచి వినిపిస్తున్న డిమాండ్స్ కూడా నేతలను షాక్‌కి గురిచేస్తున్నాయని టిడిపి నేత ఒకరు స్వయంగా చెప్పుకొచ్చారు. దాదాపు వంద కోట్ల రూపాయలు పార్టీకి సమర్పించుకోవడంతో పాటు, విశాఖ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చులన్నీ పెట్టుకోవాలన్నది షరతు. ఇక మిగతా ఖర్చులన్నీ చూసుకుంటే రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన సీటు విశాఖ ఎంపి సీటే అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశాఖలో వైకాపా బలహీనంగా ఉంది అన్న ఆలోచన టిడిపి నేతల్లో గట్టిగా ఉండడంతో ఇంతకంటే ఎక్కువ డబ్బులు పెట్టి అయినా టికెట్ కొనే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే కనీవినీ ఎరుగని స్థాయిలో విశాఖ వేదికగా డబ్బు రాజకీయాలు నడుస్తూ ఉండడం పట్ల మాత్రం విశాఖ ప్రజల్లో ఆవేధన వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -