Sunday, April 28, 2024
- Advertisement -

విమానంలాగా గాల్లో ఎగిరే కార్లు…

- Advertisement -
Silicon Valley Takes On the Flying Car

టెక్నాలజీ వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌పంచం స్వ‌రూప‌మే పూర్తిగా మారిపోతోంది. అర‌చేతిలో ప్ర‌పంచాన్ని చుట్టేస్తున్నారు.ఇక వాహ‌న రంగంలో కూడా టెక్నాల‌జీ కొత్త‌పుంత‌లు తోక్కుతోంది. కొత్త కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు నాంది ప‌లుకుతోంది.రోజుకో టెక్నాల‌జీతో త‌యార‌యిన వాహ‌నాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

కాలుష్యం పెరుగుతున్న త‌రునంలో ఆధునికి టెక్నాల‌జీని ఉప‌యేగించి ఎల‌క్ట్రిక‌ల్ కార్లు,స్కూట‌ర్లు, బ‌స్సులు రోడ్ల‌మీద‌కు వ‌చ్చాయి.డ్రైవ‌ర్ లెస్ వాహ‌నాలుకూడా ఇప్ప‌టికే అందుబాటులోకి వచ్చాయి.వీట‌న్నింటికి మించి ఇప్పుడు గాల్లో ఎగిరే కార్లు త్వ‌ర‌లోనే రాబోతున్నాయి.
హాలివుడ్ సినిమా ట్రాన్స్ పార్మ‌ర్ సిరీస్‌లో వ‌చ్చిన సినిమాలు అంద‌రికీ గుర్తండే ఉంటుంది. ఆ సినిమాలు ఎంత పాపుల‌ర్ అయ్యాయో అంద‌ర‌కి తెలిసిందే. ఆసినిమాలో కార్లు వివిధ రూపాల్లోకి మారుతూ గాల్లో చేసే విన్యాసాలు అంద‌రినీ అక‌ట్టుకున్నాయి. అలాంటి టెక్నాల‌జీతో కొత్త వాహ‌నాలు రాబోతున్నాయి.ఇప్ప‌టి వ‌ర‌కు గాల్లో ఎగిరే విమానాల్నే చూశాం. ఇక ఇప్పుడు గాల్లో ఎగిరే కార్ల‌ను చూడ‌బోతున్నాం …అంతే కాదు మ‌నం కూడా కార్లో కూర్చొని గాల్లో వెల్ల‌వ‌చ్చు. ఇది సినిమాల్లోనే అనుకుంటున్నారా… అక‌ల నిజం చేయ‌బోతోంది ఒక ఆటోమోబైల్ కంపెనీ.
ఆటోమొబైల్‌ సెక్టార్‌లో లేటెస్ట్ ట్రెండ్ ఫ్లయింగ్‌ కారు. రోడ్డుపై తిరగడంతో పాటు గాల్లో ఎగరడం దీని స్పెషల్ ఎట్రాక్షన్. మొనాకోలో జరిగిన ఆటో షోలో ఈ కారును ఆవిష్కరించింది ఏరోమొబిల్‌ కంపెనీ. స్లోవాకియాకు చెందిన ఏరోమొబిల్‌ అనే ఆటోమొబైల్‌, ఫ్లయింగ్‌ కారును తీసుకు రానుంది. కేవలం మూడు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో కారు ఫ్లయింగ్‌ మోడ్‌లోకి వెళ్తుంది. ఇక రోడ్లుపై వెళ్తున్నప్పుడు కారు మాదిరిగానే ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది.
త్వరలోనే ఈ కార్ల ముందస్తు ఆర్డర్లు ప్రకటించనున్నట్లు ఆ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 2020 నాటికి కార్లను డెలివరీ చేస్తామని ఓ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. తొలుత 500 కార్లను ఉత్పత్తి చేయాలన్నది ఆ సంస్థ ఆలోచన. త‌రువాత డిమాండ్‌ను బ‌ట్టి ఎక్కువ ఉత్ప‌త్తి చేస్తానంటోంది. రేటు విషయానికొస్తే.. 1.29 మిలియన్‌ డాలర్ల నుంచి 1.61 మిలియన్‌ డాలర్ల మధ్య ఉంటుందట. అదే ఇండియన్ కరెన్సీలో చూస్తే రూ.8 కోట్లపైనే ఉంటుంద‌ట‌. ఇక నుంచి రద్దీ ట్రాపిక్‌నుంచి వాహ‌న‌దారుల‌కు కొంతైనా ఉప‌శ‌మ‌నం క‌లిగిన‌ట్లే…. 2020 వ‌ర‌కు ఆగాల్సిందే ..

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. మీరు కూడా గాల్లో ఎగ‌రొచ్చు…
  2. ఫేస్‌బుక్ గురించి మీకు తెలియని చాలా విషయాలు..
  3. వ‌చ్చే జ‌న్మ‌లో మీరు ఏజీవిగా పుర్తారో తెలుసుకోండి.
  4. చెమ‌ట దుర్వాస‌న‌తో ఇబ్బందులా.. అయితే ఈజాగ్ర‌త్త‌లు తీసుకోండి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -