Friday, May 3, 2024
- Advertisement -

‘నోర్మూసుకుని పని చూసుకుంటే అందరికీ మంచిది’…. నంది ఇష్యూలో మెగా కాంపౌండ్‌కి సీరియస్ వార్నింగ్

- Advertisement -

గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ సారి నంది అవార్డ్స్ వివాదాస్పదమయ్యాయి. మరీ ముఖ్యంగా రుద్రమదేవి లాంటి సినిమాలను, గోన గన్నారెడ్డి పాత్రను అద్భుతంగా పోషించిన అల్లు అర్జున్‌ని అలాగే కంచె సినిమాలో వరుణ్ తేజ్ నటనను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం వివాదాస్పదమయింది. అలాగే రేసుగుర్రం సినిమాను కూడా పక్కన పెట్టేయడంతో మెగా ఫ్యాన్స్‌లో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హర్ట్ అయ్యారు. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. లెజెండ్ సినిమాతో పోల్చితే పోటీ పడ్డ ఇతర సినిమాలన్నీ కూడా గొప్పవేనని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అలాంటి నేపథ్యంలో లెజెండ్ సినిమా హీరో బాలకృష్ణకు, ఆ సినిమాకు, ఆ సినిమా తీసిన డైరెక్టర్‌కి గుంపగుత్తగా అవార్డ్స్ కేటాయించడం సామాన్య ప్రేక్షకులకు కూడా నచ్చలేదు. అందుకు గతంలో ఎన్నడూ జరగనంత రచ్చ ఈ సారి జరిగింది. నంది అవార్డ్స్‌లో అన్యాయం జరిగింది అని ఆవేధన వ్యక్తం చేసిన వాళ్ళను నారా లోకేష్ బాబు గేలిచేయడంతో బాధితులు ఇంకా రెచ్చిపోయారు. కొత్తగా పోసాని లాంటి వాళ్ళు కూడా రంగంలోకి దిగి నారా లోకేష్‌ని కడిగిపారేశారు. నారా లోకేష్ అసమర్థతను అయితే పోసాని కృష్ణమురళి ఓ స్థాయిలో విమర్శించారు. అధికార మదంతో మాట్లాడుతున్నాడని ఆవేశంగా స్పందించాడు పోసాని. మాట్లాడే పద్ధతి ఎలా ఉన్నా పోసాని చాలా నిజాయితీపరుడు. తను అనుకున్నది……తాను ఆవేధన చెందిన విషయాలపైనే మాట్లాడతాడు. అందుకే నంది అవార్డ్‌ని కూడా నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించాడు. అయితే పోసాని దెబ్బతో నంది ఇష్యూ ఇంకా చాలా పెద్దది అవుతుంది అనుకుంటే సడన్‌గా పూర్తిగా సైలెంట్ అయిపోయింది. తెరవెనుక కారణాలపై ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎవరికి అర్థం అయినా….అర్థం కాకపోయినా నంది అవార్డ్స్‌ ఇష్యూని సీరియస్‌గా తీసుకుంది మాత్రం మెగా క్యాంప్ వర్గాలే. నంది అవార్డ్స్ కేటాయింపుల్లో మెగా హీరోలకు పూర్తిగా అన్యాయం జరిగిందన్న మాట కూడా వాస్తవం. అలాగే అల్లు అర్జున్‌ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయికి దిగజార్చి అవమానించారు కూడా. అలాగే చంద్రబాబునాయుడిని, టిడిపి ప్రభుత్వాన్ని విమర్శించిన గుణశేఖర్‌ని కూడా పక్కనపెట్టేశారు. గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇచ్చినప్పుడు నా రుద్రమదేవికి మాత్రం ఎందుకు పన్ను మినహాయింపు ఇవ్వరు అని అడిగిన పాపానికి గుణశేఖర్‌కి పూర్తిగా అన్యాయం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే బాధితులందరూ కూడా నంది అవార్డ్స్ కేటాయింపులపై ఎన్ని విమర్శలు చేసినా లైట్ తీసుకున్న చంద్రబాబు అండ్ కో లోకేష్‌ని విమర్శించే పరిస్థితి వచ్చే సరికి మేటర్ సీరియస్‌గా తీసుకుందట. మెగాస్టార్ చిరంజీవితో సహా మెగా కాంపౌండ్ జనాలతో సన్నిహితంగా ఉండే ఒక రాష్ట్ర మంత్రిని పిలిపించుకుని….‘నారా లోకేష్‌పై విమర్శలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావేంటి?’ అని నిలదీశాడట చంద్రబాబు. ముందు ముందు పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న హెచ్చరికలతో ఆ మంత్రి వెంటనే అలర్ట్ అయిపోయాడట. అసలు విషయాన్ని మెగా కాంపౌండ్‌కి చెప్పి ప్రస్తుతానికి సైలెంట్ అవ్వమని సూచించాడట.

ఈ మొత్తం విషయాన్ని మెగా నిర్మాత, అల్లు అరవింద్ సన్నిహితుడు బన్నీ వాస్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పరోక్షంగా ప్రస్తావించాడు. ‘నంది ఇష్యూని ఆపేస్తే అందరికీ మంచిది’ అని బన్నీ వాస్ తన సోషల్ మీడియాలో ప్రస్తావించాడు. అయితే నంది అవార్డ్స్ ఇష్యూని ఆపమని బన్నీ వాస్ కోరినట్టుగా కాకుండా ……..‘నంది ఇష్యూని ఆపేస్తే అందరికీ మంచిది’ అని ప్రభుత్వం నుంచి మెగా కాంపౌండ్‌కి వచ్చిన వార్నింగ్‌ని బన్నీ వాస్ యధాతథంగా ప్రస్తావించాడని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే విషయంపై మెగా కాంపౌండ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వైఎస్ హయాంలో తనకు కూడా బెదిరింపులు వచ్చాయన్న పవన్ వైకాపాకు వ్యతిరేకంగా టిడిపికి మద్ధతు ఇచ్చాడు. మరి ఇప్పుడు చంద్రబాబు జమానాలో కూడా మెగా కాంపౌండ్‌కి డైరెక్ట్ వార్నింగ్స్ వస్తున్న నేపథ్యంలో మొత్తం మెగా ఫ్యామిలీ నుంచి యాక్టివ్‌గా పాలిటిక్స్‌లో ఉన్న ఒకే ఒక్కడిగా ఈ విషయంపై స్పందిస్తాడా? చంద్రబాబుతో సన్నిహిత సంబందాలున్న పవన్….మెగా ఫ్యామిలీ తరపున వకాల్తా పుచ్చుకుని చంద్రబాబును నిలదీయగలడా? పవన్ మాట్లాడాలనే మెగా ఫ్యామిలీ మెంబర్స్ కోరుకుంటున్నారు. పవన్‌తో కూడా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ముందు ముందు అయినా ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలని పవన్‌తో చంద్రబాబుకు చెప్పించే ప్రయత్నాల్లో ఉంది మెగా టీం. ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -