Friday, April 19, 2024
- Advertisement -

దుమ్మురేపిన కంగారులు.. భారత్ కి భారీ టార్గెట్!

- Advertisement -

మొన్నటి వరకు ఐపీఎల్ మ్యాచ్ తో క్రికెట్ అభిమానులు ఎంతగా సంతోషించారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. మొత్తానికి ఈసారి కప్ ముంబాయి ఇండియన్స్ దక్కించుకున్నారు. తాజాగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే ప్రారంభమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ ఎంచుకున్న కంగారులకు పిచ్ బాగానే కలిసి వచ్చింది.

కెప్టెన్ ఆరోన్ ఫించ్, స్మిత్ తలో శతకం బాదేశారు. వార్నర్ అర్థశతకం కొట్టేశాడు.. ఇక మాక్స్‌వెల్(19 బంతుల్లో 45) కూడా రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు 6వికెట్లు కోల్పోయి 374 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.  దీంతో ఇప్పుడు టీమ్ ఇండియా 375 భారీ స్కోర్ నమోదు చేయాల్సి ఉంది. ఇక భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీయగా, బుమ్రా, సైనీ, చాహాల్ ఒక్కో వికెట్ తీశారు.

రిచా సినిమాలకు ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టింది..?

మహేష్ బాబు సీక్రెట్స్ బయటపెట్టిన మంజుల..

ఆచార్య షూటింగులో రామ్ చరణ్ ఎప్పుడంటే..?

ఆర్ఆర్ఆర్ లో చిరంజీవి వాయిస్ ఓవర్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -