Thursday, March 28, 2024
- Advertisement -

ఆసియా కప్ : సూపర్ ఫైట్.. ఇండియా, పాక్ ఎవరి బలం ఎంత ?

- Advertisement -

ఆసియా కప్ లో భాగంగా నేడు సూపర్ 4 లో బిగ్ ఫైట్ కు తెరలేచింది. చిరకాల ప్రత్యర్థులు అయినటువంటి ఇండియా పాక్ జట్లు నేడు మరొకసారి తలపడనున్నాయి. సూపర్ 4 లో జరుగుతున్నా ఈ రెండవ మ్యాచ్ దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం లో జరుగుతుండగా భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రసారం కానుంది. ఇక ఇప్పటికే ఈ ఇరు జట్లు లీగ్ దశలో ఒకసారి తలపడగా అందులో టీమిండియా విజయం సాధించింది. దాంతో ఈ సారి తలపడే మ్యాచ్ లో ఎవరు పై చేయి సాధిస్తారో అని యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇరు జట్ల బల బలాల విషయానికొస్తే.. మ్యాచ్ హిట్టర్లకు కొడువేమీ లేదు.. అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ ఇరు జట్లు సమానంగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం టీమిండియాలో విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రావడం పెద్ద సానుకూలాంశం.. పాక్ తో జరిగిన గత మ్యాచ్ లో కూడా కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఇక సూర్య కుమార్ యాదవ్ అధిరిపోయే ఫామ్ లో ఉన్నాడు.. ఇక ఓపెనర్లు రోహిత్ శర్మ, కే‌ఎల్ రాహుల్ క్రితం మ్యాచ్ లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. కానీ ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో రాణిస్తే భారత్ కు తిరుగుండదు. ఇక అల్ రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమవ్వడం కాస్త మైనస్సే అని చెప్పవచ్చు. జడ్డూ తో పాటు ఆవేష్ ఖాన్ కూడా హెల్త్ సమస్యలతో జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది.

దీంతో టీమిండియా ఫైనల్ ఏ లెవెన్ ప్లేయర్స్ కూర్పు ఎలా ఉండబోతుదనేది ఆసక్తికరంగా మారింది. ఇక పాక్ విషయానికొస్తే.. మహ్మద్ రిజ్వన్, బాబర్ ఆజమ్, ఫఖర్ జమన్, ఇఫ్తికర్ అహ్మద్ వంటి ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఈ ప్రేయర్స్ మ్యాచ్ స్వరూపన్నే మార్చేయగల సత్తా ఉన్న ఆటగాళ్ళే.. దాంతో వీరిని ఎంతమాత్రం తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఇక బౌలింగ్ విషయంలో పాక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దాంతో గత మ్యాచ్ ఓటమి కారణంగా ప్రతీకారంతో ఉన్న పాక్ ను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా టీమిండియా రెట్టింపు బలంతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. మరి ప్రస్తుతం అద్భుత ఫామ్ లో ఉన్న టీమిండియా చిరకాల ప్రత్యర్థి పై ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

టీమిండియా అంచనా : రోహిత్ శర్మ ( కెప్టెన్ ) , కే‌ఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హర్ధిక్ పాండ్య, దినేష్ కార్తీక్ / రిషబ్ పంత్ ( వికెట్ కీపర్ ), దీపక్ హుడా / ఆక్సర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్ ధీప్ సింగ్, యజ్వెంద్ర చహల్, ఆవేష్ ఖాన్ / అశ్విన్


పాకిస్టాన్ అంచనా : మహ్మద్ రిజ్వన్ (wk), బాబర్ ఆజమ్ ( కెప్టెన్ ), ఫఖర్ జమన్, ఇఫ్తికర్ మహ్మద్, ఖుష్దిల్ షా, షధాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హరిస్ రావుఫ్, నసీమ షా, షానవాజ్ దహని.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -