ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌ను బహిష్కరిస్తే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఐసీసీ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశముంది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చి, భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పీసీబీకి భారీ ఆర్థిక నష్టాలు, భవిష్యత్ టోర్నమెంట్లపై నిషేధం వంటి శిక్షలు పడే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
ఐసీసీ ఈ అంశంపై ఇప్పటికే పీసీబీకి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 15న జరిగే మ్యాచ్‌కు సల్మాన్ ఆఘా నేతృత్వంలోని జట్టు మైదానంలోకి దిగకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఐసీసీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అనేది ఏ ఐసీసీ టోర్నమెంట్‌లోనైనా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే పోరు. ఈ మ్యాచ్‌కు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టీవీ వీక్షకులు, స్పాన్సర్ ఆసక్తి, ప్రసార ఆదాయం ఉంటుంది. ఈ మ్యాచ్ రద్దైతే హోస్ట్ బ్రాడ్‌కాస్టర్‌కు సుమారు రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు ప్రకటన ఆదాయం నష్టం వచ్చే అవకాశం ఉందని అంచనా. ఒక్కో 10 సెకన్ల ప్రకటన స్లాట్ ధరే రూ.40 లక్షల వరకు ఉండడం విశేషం.
మ్యాచ్‌కు పాకిస్థాన్ దిగకపోతే భారత్‌కు వాక్ ఓవర్ ద్వారా పూర్తి పాయింట్లు లభించినా, ఐసీసీకి పీసీబీపై ఆర్థిక జరిమానాలు విధించే పూర్తి అధికారం ఉంది. అంతేకాదు, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల కోత, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో స్థానం మారకపోవడం, ప్రధాన క్రికెట్ దేశాలు పాకిస్థాన్‌కు పర్యటనలకు నిరాకరించడం, పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆటగాళ్ల పాల్గొనడంపై ఆంక్షలు వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్‌కే కాదు, ప్రపంచ క్రికెట్ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని ఐసీసీ హెచ్చరించింది. “ఈ నిర్ణయం పాకిస్థాన్‌లో క్రికెట్ భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది.
