Sunday, May 12, 2024
- Advertisement -

క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఎవ‌రూ చూడని ఔట్‌..

- Advertisement -

క్రికెట్‌లో రికార్డులు, అద్భుతాల‌కు కొదువ ఉండ‌దు. విచిత్ర పరిస్థితుల్లో కొందరు ఔటవుతుంతారు. అలాంటి సంఘ‌ట‌న‌లు న‌వ్వు తెప్పించ‌క మాన‌వు. ఆస్ట్రేలియా-కివీస్ మహిళల మధ్య గురువారం జరిగిన వన్డేలో ఓ వింత ఔట్ చోటుచేసుకుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్‌లోనూ ఇప్పటి వరకు ఇటువంటి అవుట్‌ను చూసి ఉండరు. సిడ్నీలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మహిళా జట్ల మధ్య వన్డే మ్యాచ్‌ జరిగింది. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజీలాండ్‌ 45వ ఓవర్లో కేటీపర్కిన్స్‌ వికెట్‌ కోల్పోయింది. అవుట్ అవ్వ‌డం సాదార‌న‌మే అయినా ఆమె ఔట్ అయిన తీరు అంద‌రికీ న‌వ్వు తెప్పిస్తోంది.

కివీస్ బ్యాట్స్‌విమెన్ కాటీ పెర్కిన్స్ క్రీజులో ఉంది. నాన్ స్ట్రైకర్‌గా కాటీ మార్టిన్ ఉంది. ఆసీస్ బౌలర్ హెథర్ గ్రహం వేసిన బంతిని పెర్కిన్స్ బలంగా కొట్టింది. బంతి సరాసరి నాన్‌స్ట్రైకర్‌ క్యాటీమార్టిన్‌ బ్యాట్‌కు తగిలి గాల్లోకి లేచింది. వెంటనే తేరుకున్న బౌలర్‌ హీథర్‌గ్రహం ఆ బంతిని అందుకోవడంతో పర్కిన్స్‌ వికెట్‌ కోల్పోయింది. చేసేదేం లేక ఆస్ట్రేలియా క్రికెటర్లు నవ్వుకొని సంబరపడ్డారు. తొలుత ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అది ఔటా? కాదా? అన్న సంశయంతో ఫీల్డ్ అంపైర్లు.. థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించారు. సమీక్షలో అది అవుట్ అని ప్రకటించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆసిస్ ఓడిపోయినా..కేటీపర్కిన్స్‌ ఔటైన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -