- Advertisement -

విండీస్‌తో మ్యాచ్‌..వరుణ్‌కు కీలక సూచన!

- Advertisement -

ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ – వెస్టిండీస్ మధ్య 52వ మ్యాచ్‌కు వేదిక సిద్ధమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ జట్టు వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే టోర్నమెంట్ నాకౌట్ దశకు అధికారికంగా అర్హత సాధిస్తుంది.

ఈ కీలక పోరుకు ముందు మాజీ భారత క్రికెటర్ బద్రినాద్…, స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ముఖ్యమైన సలహా ఇచ్చారు. జింబాబ్వేతో జరిగిన గత మ్యాచ్‌లో చక్రవర్తి నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నారు. అతని ప్రదర్శనపై స్పందించిన బద్రినాథ్, వరుణ్ తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అతను మొదటి బంతి నుంచే గూగ్లీ వేస్తున్నాడు. బ్యాటర్లు అందుకు సిద్ధంగా ఉంటున్నారు. అందుకే లెగ్ సైడ్‌కు బంతిని సులభంగా కొడుతున్నారు. అనలిటిక్స్ ద్వారా అతను మొదటి బంతిగా గూగ్లీనే వేస్తాడని అందరూ తెలుసుకున్నారు. అవుట్‌సైడ్‌కు వెళ్లే బంతులను తక్కువగా వేస్తున్నాడు. కాబట్టి బ్యాటర్లు అతని ఇన్‌కమింగ్ డెలివరీకే సిద్ధమవుతున్నారు. ఇది వారికి ఇబ్బంది కలిగించడం లేదు. వరుణ్ తన వ్యూహాన్ని మళ్లీ ఆలోచించాలి అని బద్రినాథ్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నారు.

అంతేకాకుండా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబే బౌలింగ్‌పై కూడా బద్రినాథ్ స్పందించారు. రెండు ఓవర్లలో దైబే 46 పరుగులు ఇచ్చారు. వరుణ్ భారత్‌కు ట్రంప్ కార్డ్ లాంటివాడు. అతను పరుగులు ఇస్తే భారత్ దూబేను బౌలింగ్‌కు పెట్టాల్సి వస్తుంది, అది ప్రమాదకరం. ఆరో బౌలర్‌గా డ్యూబే నమ్మదగినవాడిగా కనిపించడం లేదు. జింబాబ్వే వంటి జట్టుపై కూడా అతన్ని నమ్మలేకపోతే, వెస్టిండీస్‌పై ఎలా నమ్మగలం ” అని ఆయన ప్రశ్నించారు.

మొత్తానికి, వెస్టిండీస్‌తో కీలక మ్యాచ్‌కు ముందు భారత్ బౌలింగ్ విభాగం సమన్వయం సాధించాల్సిన అవసరం ఉందని బద్రినాథ్ సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -