Sunday, May 5, 2024
- Advertisement -

ఏడాదిపాటు నిషేధంపై అనూహ్య‌నిర్ణ‌యం తీసుకున్న స్మిత్‌..

- Advertisement -

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో ఏడాది నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తనపై క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) విధించిన శిక్షను సవాలు చేయబోనని ఆయన ప్రకటించారు. నిషేధాన్ని ఎదుర్కొంటానని తెలిపారు.

బాల్ ట్యాంపరింగ్ వివాదంతో దేశానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించడంతో వార్నర్, స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకుంది. ఏడాదిపాటు క్రికెట్ ఆడకుండా స్మిత్, వార్నర్‌పై నిషేధం విధించింది. బాన్‌క్రాఫ్ట్‌ను 9 నెలలపాటు సస్పెండ్ చేసింది. వేటుకు గురైన తర్వాత ఆటగాళ్లు మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పారు. తప్పు చేశామంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

క్రికెటర్లపై ఏడాదిపై శిక్ష విధించడం అన్యాయమని మాజీలు, విశ్లేషకులు అభిప్రాయపడిన సంగ‌తి తెల‌సిందే. ఆంక్షల విషయంలో బోర్డు మరోసారి ఆలోచించాలని, నిషేధాన్ని తగ్గించే అవకాశాలను పరిశీలించాలని బోర్డును కోరింది. దేశవాళీ క్రికెట్లోనైనా ఆడే అవకాశం కల్పించాలని అభ్యర్థించింది

ఈ నేపథ్యంలో స్మిత్ స్పందిస్తూ.. తాను దేశం తరఫున తిరిగి ఆడటానికి కృషి చేస్తానని తెలిపాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో కెప్టెన్‌గా పూర్తి బాధ్యత నాదే. నాపై విధించిన ఆంక్షలను సడలించాలని అభ్యర్థించను. మాపై విధించిన సస్పెన్షన్ నిర్ణయాన్ని సవాల్ చేయను. తప్పు చేస్తే ఉపేక్షించబోమని సంకేతాలు పంపడానికే క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. నేను దాన్ని అంగీకరించానని స్మిత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -