టీమిండియాకు క్రికెట్ ఆస్ట్రేలియా సారీ

- Advertisement -

క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) టీమిండియాను క్షమాపణ కోరింది. భార‌త బౌల‌ర్లు జ‌స్‌ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్‌ల‌ను ఉద్దేశించి ప్రేక్ష‌కులు చేసిన జాత్యహంకార వ్యాఖ్య‌ల‌కు చింతిస్తున్న‌ట్టు తెలిపింది. ఈ మేర‌కు సీఏ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెబుతున్న‌ట్లు పేర్కొంది. ఇలాంటి వివ‌క్ష పూరిత ప్ర‌వ‌ర్త‌న‌ను స‌హించ‌బోమ‌ని ఆక‌తాయిల‌ను హెచ్చ‌రించింది.

కాగా సిడ్నీలో జ‌రుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా బుమ్రా, సిరాజ్‌లపై స్టేడియంలోని ప్రేక్షకులు వ‌ర్ణ వ్యాఖ్య‌లు చేశారు. సిరాజ్‌ను ఉద్దేశించి మంకీ అని కామెంట్ చేశారు. నాలుగో రోజు ఆట‌లో కూడా మ‌రోసారి బిగ్ మంకీ అని జాతి వివ‌క్ష వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు స‌మాచారం. ఆతిథ్య బోర్డు సీఏ విచారణ జరుపనుంది. ఇక ఆదివారం నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి భార‌త్‌ రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది.

- Advertisement -

ఇక ఈ టె‌స్టులో టీమిండియా గెల‌వాలంటే ఇంకా 309 పరుగులు చేయాలి. ఓపెన‌ర్లు శుబ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మలు తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. గిల్‌(31; 64 బంతుల్లో 4 ఫోర్లు)ను హాజిల్‌వుట్ పెవిలియ‌న్‌కు పంపించాడు. అర్ధ సెంచ‌రీ చేసిన(52 ప‌రుగులు(98)) హిట్‌మ్యాన్ క‌మిన్్స బౌలింగ్‌లో స్టార్్క‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పుజారా, ర‌హానే క్రీజులో ఉన్నారు.

ఆమోద‌యోగ్యం కాదు.. చ‌ర్య‌లు తీసుకోండి‌

జ‌స్‌ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు చేదు అనుభ‌వం

టాలీవుడ్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ ఇవే..!

సాగర్‌ పోరు.. విజయం ఎవరిదో

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...