భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల ముందు సౌతాఫ్రికాతో జరిగే టీ20కి అందుబాటులో ఉంటానన్న మిథాలీ ఇప్పుడు ఇలా నిర్ణయం తీసుకోవడం అందరద్నీ ఇశ్చర్యానికి గురి చేసింది. అంతర్జాతీ టీ20లకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు.
2021లో జరిగే వన్డే ప్రపంచకప్ కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిథాలీ తెలిపింది. భారత్ కు ప్రపంచకప్ సాధించిపెట్టడం తన కల అనీ, తనకు సహకరించిన బీసీసీఐకి ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొంది.
మిథాలీరాజ్ తొలిసారి 2006లో ఇంగ్లాండ్ లోని డెర్బీలో మొదటి టీ20 మ్యాచ్ ఆడింది. భారత్ తరఫున 89 టీ20 మ్యాచ్‌లు ఆడిన మిథాలీ వాటిలో 32 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇక మూడు టీ20 వరల్డ్‌కప్‌లు ఉండటం విశేషం.తన టీ 20 కెరీర్ లో మిథాలీ, 2,364 పరుగులు చేసింది. ఇందులో 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మిథాలీ టీ20లో గరిష్టంగా 97 పరుగులు సాధించింది.
గతంలో భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలీల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.గతేడాది నవంబర్ లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ లో ఆమెను పక్కనపెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఈ నేపథ్యంలోనే మిథాలీ టీ20 విభాగం నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
2006 నుంచి భారత్ తరఫున టీ20లు ఆడుతున్నా. టీ20లతో పనిభారం ఎక్కువగా ఉండటంతో రిటైర్మెంట్ తీసుకోవాలను కుంటున్నా. 2021 వన్డే వరల్డ్‌కప్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడంపైనే దృష్టి సారించానని మిథాలీ తెలిపింది.
