భారత మాజీ క్రికెటర్ ఏజీ మిల్కా సింగ్(75) కన్నుమూశారు. శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గుండె పోటుకు గురైన మిల్కాసింగ్ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్టైలిష్ బ్యాట్స్‌మన్‌గా పేరు పొందిన టీమిండియా మాజీ క్రికెటర్ ఏజీ మిల్కాసింగ్ (75) గుండెపోటుతో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బ్యాటింగ్‌లోనే కాకుండా, అద్భుత ఫీల్డర్‌గా ఆయన పేరుపొందారు.
ఎడమ చేతి వాటం బ్యాట్స్ మన్ అయిన మిల్కా సింగ్ ఒక మంచి ఫీల్డర్ కూడా. తన 17వ ఏట రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన మిల్కాసింగ్.. 18వ ఏట తొలి టెస్టు ఆడారు. మిల్కాసింగ్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఎనిమిది సెంచరీలతో నాలుగు వేలకు పైగా పరుగులు సాధించారు. అప్పటి మద్రాసు(నేటి తమిళనాడు) రాష్ట్రం తరపున రంజీ మ్యాచ్ లు ఆడారు.
ఆయన సోదరుడు కృపాల్‌సింగ్ 14 టెస్టుల్లో ఆడారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసే మిల్కాసింగ్ తన సోదరుడు కృపాల్ సింగ్‌తో కలిసి కూడా టీమిండియాలో ఆడారు.
