Friday, May 3, 2024
- Advertisement -

టీమిండియా వ‌రుస విజ‌యాల‌కు షాక్ ఇచ్చిన ఇంగ్లండ్‌…

- Advertisement -

ఈ ప్ర‌పంచ క‌ప్‌లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న టీమిండియాకు ఓట‌మి రుచిని చూపించింది ఇంగ్లండ్ జ‌ట్టు.సెమీస్ రేసులో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ అద‌ర‌గొట్టింది. ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి ఇంగ్లండ్ సెమీస్ ఆశలు నిలుపుకుంది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 337 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (109 బంతుల్లో 111; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) ప్రపంచకప్‌లో తొలి శతకంతో అదరగొట్టగా.. బెన్ స్టోక్స్ (54 బంతుల్లో 79; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), జాసన్ రాయ్ (57 బంతుల్లో 66; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విజృంభించిన మొహమ్మద్ షమీ (5/59) ఐదు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. బుమ్రా (1/44) పొదుపుగా బౌలింగ్ చేశాడు.

338 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 306 పరుగులకే కుప్పకూలి 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రోహిత్ శర్మ (109 బంతుల్లో 102; 15 ఫోర్లు) ఈ టోర్నీలో మూడో సెంచరీ నమోదు చేసుకోగా.. విరాట్ కోహ్లీ (76 బంతుల్లో 66; 7 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ప్లంకెట్ 3, వోక్స్ 2 వికెట్లు పడగొట్టారు. బెయిర్‌స్టోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్‌లో భారత్ మంగళవారం శ్రీలంకతో తలపడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -