Saturday, May 4, 2024
- Advertisement -

ధోని రికార్డును బద్దలు కొట్టేందుకు అడుగ దూరంలో కోహ్లీ…

- Advertisement -

కరీబియన్‌ జట్టుతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 318 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ పేరిట ఉన్న అరుదైన రికార్డును అధిగమించేందుకు ఒక్క అడుగుదూరంలో ఉన్నాడు.

టెస్టు క్రికెట్లో భారత్ కు అత్యధిక విజయాలు అందించిన ధోనీ రికార్డును తాజాగా కోహ్లీ సమం చేశాడు.భారత టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇది నాలుగో అతిపెద్ద విజయం కావడం విశేషం. టెస్టుల్లో విరాట్‌ నేతృత్వంలోని భారత్‌ మరో విజయాన్ని సొంతం చేసుకుంటే టెస్టుల్లో అత్యధిక విజయాలు అందించిన సారథిగా రికార్డు నెలకొల్పనున్నాడు.

తన కెరీర్‌లో 60 టెస్టులకు సారథిగా వ్యవహరించిన కెప్టెన్‌ కూల్‌ ధోనీ 27 మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా మహీనే కొనసాగుతుండగా తాజాగా విరాట్ బ్రేక్ చేశాడు.ఇప్పటి వరకు 47 టెస్టులకు నాయకత్వం వహించిన విరాట్‌ 27 గేమ్‌ల్లో భారత్‌కు విజయాలు అందించి ధోనీ(60 టెస్టుల్లో) సరసన నిలిచాడు. ఆ రికార్డును అధిగమించేందుకు విరాట్‌కు కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -