Sunday, May 5, 2024
- Advertisement -

సెలక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన టీమిండియా బ్యాటింగ్ సంజయ్ భంగర్…

- Advertisement -

ప్రపంచకప్ లో సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా టీమిండియా పరాజయం పాలవడంతో కోచ్ ఇతర సిబ్బందిని మార్చాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని నియమిస్తూ కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని భారత క్రికెట్‌ సలహా కమిటీ నిర్ణయం తీసుకోగా, సహాయక సిబ్బందిని చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ నేతృత్వంలో సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది.

మిగిలిన ముగ్గురికి బీసీసీఐ కాంట్రాక్టు దక్కినా అందురూ అనుకున్నట్లుగానె బ్యాటింగ్ కోచ్ బంగర్ పై వేటు పడింది. బంగర్ బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. తాజాగా బంగర్ విషయం బయటపడింది. ఇంటర్వ్యూలు జరుగుతున్న సమయంలో భారత క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ కమిటీలో సభ్యుడైన దేవాంగ్ గాంధీ గదికి బంగర్ వెళ్లడమే కాకుండా తనను మళ్లీ బ్యాటింగ్ కోచ్ గా ఎంపిక చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడట. జట్ట తనకు అండగా ఉందని బ్యాటింగ్ కోచ్ గా ఎంపిక చేయకుంటె జాతీయ క్రికెట్ అకాడమీలో ఏదో ఒక పదవి ఇప్పించాలని బెదిరించినట్లు తెలుస్తోంది.ఈ విషయం ఇప్పుడు బయట పడటంతో సీఓఏ కమిటీ అధినేత వినోద్ రాయ్ వరకు వెల్లింది. నిజా నిజాలు తెలుసుకొనేందుకు బీసీసీఐ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -