Wednesday, April 24, 2024
- Advertisement -

సిడ్నీ నాలుగో టెస్ట్‌కు భార‌త‌జట్టు ఇదే..విజ‌య్ ఔట్‌…రాహుల్ ఇన్‌

- Advertisement -

ఆసిస్‌తో అమితుమీ తేల్చుకొనేందుకు భార‌త్ సిద్ద‌మ‌య్యింది. ఈ మ్యాచ్‌లోను విజ‌యం సాధించి ఏడు దశాబ్దాల క‌లని నిజం చేసుకోవాల‌ని టీం ఇండియా భావిస్తుంది. ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో సిరీస్‌ విజయం సాధించే సువర్ణావకాశాన్ని సృష్టించుకున్న కోహ్లీసేన.. ఉరకలెత్తే ఉత్సాహంతో సిడ్నీ టెస్టుకు సిద్ధమైంది. ఇప్ప‌టికే 2-1 ఆధిక్యంలో ఉన్న భార‌త్ సిడ్నీ టెస్ట్ గెలిచి ఆసిస్ గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించాల‌ని కోహ్లీ సేన ఆరాట‌ప‌డుతోంది.

నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న టీమ్‌ఇండియా రేప‌టి మ్యాచ్‌ని డ్రా చేసుకున్నా కూడా సిరీస్ భార‌త సొంతం అవుతుంది. నాలుగో టెస్టుకు 13 మంది సభ్యులతో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఫాం లేమితో స‌త‌మ‌త‌మ‌వుతున్న రాహుల్‌కి మ‌రో ఛాన్స్ ఇవ్వ‌గా, ముర‌ళీ విజ‌య్‌ని ఈ మ్యాచ్ నుండి త‌ప్పించింది.

రోహిత్ వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల నాలుగో టెస్టుకు దూర‌మ‌య్యాడు . వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. ఇషాంత్ శ‌ర్మ‌స్థానంలో ఉమేష్ యాద‌వ్‌కు అనూహ్యంగా చోటు క‌ల్పించింది మేనేజ్‌మెంట్‌. స్పిన్ విభాగంలో జ‌డేశా, అశ్విన్‌, కుల్‌దీప్ యాద‌వ్‌ల‌ని సెల‌క్ట్ చేయ‌గా వీరిలో ఒక‌రు మాత్ర‌మే తుది జ‌ట్టులో ఉంటారు. అశ్విన్‌ తుది జట్టులో ఉంటాడా, లేదా అనేది మ్యాచ్‌ ప్రారంభానికి ముందు నిర్ణయిస్తామని బీసీసీఐ తెలిపింది.

బీసీసీఐ ప్రకటించిన జట్టు
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), అజింక్య రహానే(వైస్‌ కెప్టెన్‌), ఛతేశ్వర్‌ పుజారా, కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారి, రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమి, జస్ప్రిత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -