Friday, April 19, 2024
- Advertisement -

ఆసిస్ గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్‌..

- Advertisement -

టీమిండియా యువ వికెట్ కీప‌ర్ రిషభ్ పంత్ సిడ్నీ టెస్ట్‌లో రికార్డ్‌ల మోత మోగించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో సెన్సేషనల్ సెంచరీతో చరిత్రను తిరగరాశాడు. ఆసిస్ గ‌డ్డ‌పై ఏ వికెట్ కీప‌ర్ సాధించ‌ని రికార్డుల‌ను పంత్ సాధించాడు.

నాలుగో టెస్ట్‌లో శతకంతో భారత్‌కు భారీ స్కోర్ అందించడం మాత్రమే కాదు..కనీ వినీ రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. 189 బంతుల్లో 15 ఫోర్లు ఓ సిక్సర్‌తో 159 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు అక్క‌డ మాజీ క్రికెటర్ ఫరుక్ ఇంజినీర్(89) అత్యుత్తమ స్కోరు.

గతంలో ఆసీస్ పర్యటనకు వచ్చిన వికెట్ కీపర్లలో ఇంజినీర్(89, 1991లో).. కీరన్ మోరే(67 నాటౌట్ 1991), పార్థీవ్ పటేల్(62, 2004లో).. మహేంద్రసింగ్ ధోనీ(57 నాటౌట్, 2012లో) ఉన్నారు. విదేశీ గడ్డపై అత్యధిక స్కోరు చేసిన వికెట్ కీపర్ కూడా పంతే. గతంలో 2006లో ఫైసలాబాద్‌లో పాకిస్థాన్‌తో టెస్టులో భారత మాజీ కెప్టెన్ ధోనీ 148 పరుగులతో ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగాడు. తాజాగా పంత్(159*) మహీని అధిగమించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -