Friday, April 19, 2024
- Advertisement -

నిమ్మ‌గ‌డ్డ హెచ్చ‌రిక‌.. అది మీడియాను ఎంగేజ్ చేయ‌డానికేనా

- Advertisement -

పంచాయ‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌చ్చ‌ని ప‌ల్లెల్లో చిచ్చు పెట్టాల‌ని చూసిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు సొంత జిల్లాలోనే చేదు అనుభ‌వం ఎదురైంద‌ని వైఎస్సార్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శించారు. చిత్తూరులోనే అత్య‌ధిక పంచాయ‌తీలు ఏక‌గ్రీవం కావ‌డం ప‌ట్ల ఆయ‌న శుక్ర‌వారం, ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఈ మేర‌కు.. ఏకగ్రీవాలను అడ్డుకుని కక్షలు, కార్పణ్యాలను రగిల్చి గ్రామాల్లో ఐకమత్యం లేకుండా చేయాలన్నది చంద్రబాబు కుట్ర. చెంప చెళ్ళుమనిపిస్తూ…ఆయన సొంత జిల్లా చిత్తూరులోనే అత్యధిక పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కుప్పంలోనూ కూసాలు కదిలిపోతున్నాయి అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

అదే విధంగా.. పార్టీ ర‌హిత ఎన్నిక‌ల్లో టీడీపీ తీసుకువ‌చ్చిన మేనిఫెస్టోను రద్దు చేస్తున్నట్లు ఎన్నిక‌ల క‌మిష‌న్ తీసుకున్న నిర్ణ‌యంపై విజ‌య‌సాయిరెడ్డి సందేహాలు వ్య‌క్తం చేశారు. ” టీడీపీ పంచాయతీల ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలు మొదటి రోజే తిరస్కరించారు. ఇప్పుడు ఉపసంహరించుకోవాలని నిమ్మగడ్డ సుతిమెత్తని హెచ్చరిక జారీ చేస్తున్నారు. అయినా చంద్రబాబుకు తెలియక విడుదల చేశారా? ఎల్లో మీడియాను రోజంతా ఎంగేజ్ చేయడానికి ఆ తతంగం పెట్టుకున్నాడు అని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎస్ఈసీ తీరును ఎండ‌గ‌ట్టారు.

ఇక కేంద్ర బ‌డ్జెట్ విష‌యంలో టీడీపీ అనుస‌రిస్తున్న తీరుపై కూడా విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు. బ‌డ్జెట్‌-2021 కేంద్ర బడ్జెట్‌పై నోరు విప్పడానికి చంద్రబాబు గజగజ వణికి పోతున్నాడు. టీడీపీ ఎన్డీయేలో భాగస్వామి కాదు. బిజెపితో పొత్తూ లేదు. ఉండదని కమలం పార్టీ పెద్దలు కరాకండిగా చెప్పారు. అయినా బాబుకు నోరు పెగలడం లేదు. తన రాజకీయ విధానాలేమిటో కూడా చెప్పుకోలేని దయనీయ స్థితిలో ఉన్నాడు బాబు అంటూ సెటైర్లు వేశారు.

ఇక పవన్‌ సీఎం, సీఎం బంద్‌!

టీడీపీ షాకిచ్చిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ!

సోహెల్ తో అరియానా మళ్ళీ రెచ్చిపోయిందిగా…!

రమ్యకృష్ణ రోజుకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -