Friday, March 29, 2024
- Advertisement -

కోహ్లీ స్థానంలో అండ‌ర్ 19 యువ క్రికెట‌ర్‌..

- Advertisement -

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న ఐదు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా ఇప్ప‌టికే మూడు వ‌న్డేలు గెలిచి సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది టీమిండియా. విరామం లేకుండా వ‌రుస‌గా సిరీస్‌లు ఆడుతున్న కోహ్లీకి విశ్రాంతి నిచ్చింది మేనేజ్‌మెంట్‌. దీంతో మిగిలిన రెండు వ‌న్డేల‌కు, త‌ర్వాత జ‌రిగే టీ20ల‌కు దూరం కానున్నారు కోహ్లీ.

త్వ‌ర‌లో ఇగ్లండులో ప్ర‌పంచ క‌ప్ ఉన్నందుక‌న ప్ర‌యోగాలు చేస్తోంది టీమిండియా మేనేజ్‌మెంట్‌. ఈ నేప‌ధ్యంలో కోహ్లీ బ్యాటింగ్ స్థానంలో యువ క్రికెట‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌ను ఆడించాల‌ని సీనియ‌ర్లు స‌ల‌హాలు ఇస్తున్నారు. ప్ర‌స్తుతం కోహ్లీ 3వ‌స్థానంలో బ్యాటింగ్‌కు వ‌స్తున్నాడు. చివ‌రి రెండు వ‌న్డేల‌కు గిల్‌ను కోహ్లీ స్థానంలో నం.3లో బ్యాటింగ్‌కు పంపించాలని సూచించారు.

కివీస్‌తో హామిల్టన్ వేదికగా గురువారం ఉదయం 7.30 గంటలకి నాలుగో వన్డే ప్రారంభంకానుండగా.. 4, 5వ వన్డే, ఆ తర్వాత మూడు టీ20ల నుంచి విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. న్యూజిలాండ్ గడ్డపై ఈ ఐదు మ్యాచ్‌ల్లో టీమ్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నాడు.

పృథ్వీషా నేతృత్వంలో అండర్‌-19 ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో గిల్‌ కూడా ఒకడు. భారత్-ఎ జట్టు తరఫున కూడా నిలకడగా రాణించాడు. దీంతో.. ఇటీవల సస్పెన్షన్‌కి గురైన కేఎల్ రాహుల్ స్థానంలో అతడ్ని న్యూజిలాండ్ పర్యటనకి సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే మొద‌టి మూడు వ‌న్డేల్లో చోటు ద‌క్క‌లేదు. కోహ్లీకి విశ్రాంతి నివ్వ‌డంతో శుభ్‌మ‌న్ గిల్‌కు అవ‌కాశం వ‌చ్చింది. ఇక సీనియర్ ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్, మహ్మద్ షమీలో ఒకరికి లేదా ఇద్దరికీ విశ్రాంతినిచ్చి.. ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్‌కి మరో అవకాశం ఇవ్వడంపై కూడా టీమిండియా మేనేజ్‌మెంట్ చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -