Sunday, May 5, 2024
- Advertisement -

మూడో టెస్ట్ జ‌రిగిన పిచ్‌కు వేవ‌ల‌మైన రేటింగ్ ఇచ్చిన ఐసీసీ..

- Advertisement -

భారత్, దక్షిణాఫ్రికా మధ్య వాండరర్స్ వేదికగా శనివారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌ పిచ్‌‌కి మంగళవారం ఐసీసీ పేలవ రేటింగ్ ఇచ్చింది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో భారత్ జట్టు 63 పరుగుల తేడాతో గెలుపొంది వైట్‌వాష్ పరాభవం నుంచి తప్పించుకుంది.

ఆటలో మూడో రోజైన శుక్రవారం పిచ్‌ మరీ ప్రమాదకరంగా స్పందించింది. అంతు ముందు రోజు కూడా పిచ్ ఆట‌గాళ్లను పెద్ద ఇబ్బంది పెట్టిన సంగ‌తి తెలిసిందే. పిచ్‌పై అనూహ్యంగా బంతి బౌన్స్‌ అవ్వ‌డంతో భార‌త బ్యాట్స్‌మెన్‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. అప్పుడే పిచ్‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

స‌ఫారీ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో జస్‌ప్రీత్ బుమ్రా విసిరిన బౌన్సర్ ఒకటి.. దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ హెల్మెట్‌కి బలంగా తాకడంతో ఆ రోజు గంట ముందే అంపైర్లు మ్యాచ్‌ని నిలిపివేశారు. శనివారం వర్షం పడటంతో.. ఆటని కొనసాగించగా.. మూడో సెషన్‌ చివర్లో దక్షిణాఫ్రికా పేలవ రీతిలో ఆలౌటైంది.

వాండరర్స్ టెస్టు మ్యాచ్‌కు రిఫరీగా ఉన్న జింబాబ్వే మాజీ క్రికెటర్ ఆండీ పైకాప్ట్ పిచ్‌ తీరుపై పెదవి విరిచారు. దీంతో అతని నివేదికను ఆధారంగా చేసుకుని ఐసీసీ పిచ్‌కి పేలవ రేటింగ్ ఇవ్వడంతో వాండరర్స్ స్టేడియానికి మూడు డీమెరిట్ పాయింట్లు వచ్చాయి.

వచ్చే ఐదేళ్లలోపు మరో రెండు డీమెరిట్ పాయింట్ల వస్తే.. ఏడాది పాటు ఈ స్టేడియాన్ని ఐసీసీ నిషేధించనుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు క్యురేటర్ మాట్లాడుతూ ‘పేస్, బౌన్స్‌కి అనుకూలించే పిచ్‌ని తయారు చేశాను. ఐదు రోజుల పాటు పిచ్‌లో పెద్దగా మార్పులుండకపోవచ్చు. ఆట చివరి రోజు వరకూ సాగుతుంది’ అని చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -