Monday, May 6, 2024
- Advertisement -

బౌల‌ర్ల ధాటికి 130 కే చేతులెత్తేసిన సౌతాఫ్రికా….భార‌త్ విజ‌య ల‌క్ష్యం208

- Advertisement -

భార‌త్ బౌలర్లు విజృంభించ‌డంతో సౌతాఫ్రికా 130 ప‌రుగుల‌కే చాప‌చూట్టేసింది. సెకెండ్ ఇన్నింగ్స్ లో డివిలియ‌ర్స్ (35) మిన‌హా ఏ ఒక్క బాట్స్ మెన్ రాణించ‌క‌పోవ‌డంతో ఆజ‌ట్టు స్వ‌ల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యింది. మొద‌టి ఇన్నింగ్స్ 77 ప‌రుగుల లీడ్ క‌లుపుకుని .. మొత్తం సౌతాఫ్రికా 207 ప‌రుగులు ఆధిక్యం సాధించి.. భార‌త్ ముందు 208 ప‌రుగుల టార్గెట్ ఉంచింది

అయితే ఇదే మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అరుదైన రికార్డ్‌ను నెలకొల్పాడు. టీమిండియా తరఫున ఒక టెస్టులో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు అందుకున్న సాహా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఐదు క్యాచ్‌లు పట్టాడు. దీంతో పది వికెట్లను కూల్చడంలో భాగస్వామ్యం పొందిన తొలి భారత కీపర్‌గా నిలిచాడు.

సఫారీ గడ్డ మీద తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు చెలరేగిపోవడంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా 130 పరుగులకే కుప్పకూలింది. వర్షం కారణంగా మూడో రోజు ఆట రద్దు కాగా.. 65-2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికాను భారత పేసర్లు వణికించారు. మూడో రోజు ఆటలో డివిలియర్స్ (35), కేశవ్ మహారాజ్ (15) మినహా మరే బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.

రెండో ఇన్నింగ్స్‌లో భువీ, పాండ్య చెరో రెండు వికెట్లు తీయగా.. షమీ, బుమ్రా తలో మూడు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లోనూ ఈ నలుగురు బౌలర్లకు వికెట్లు దక్కాయి. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత్ తరఫున నలుగురు ఫాస్ట్ ‌బౌలర్లు కనీసం ఒక వికెట్‌నైనా తమ ఖాతాలో వేసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. స‌ఫారీలు నిర్దేశించిర 208 ప‌రుగుల ల‌క్ష్యం చేరుకోవ‌డం క‌ష్ట‌మైన ప‌నికాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -