Sunday, May 12, 2024
- Advertisement -

పుజారా చెత్త రికార్డ్‌….మ‌రో సారి చెత్త‌గా ఆడిన పాండ్యా..

- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా రనౌట్ అయిన ఛటేశ్వర పుజారా.. మళ్లీ రెండో ఇన్నింగ్స్‌లోనూ అలాగే ఔటయ్యాడు. మూడో పరుగుకు ప్రయత్నించిన పుజారా.. ఏబీ డివిలియర్స్ త్రో నుంచి తప్పించుకోలేకపోయాడు. అసలే కష్టాల్లో ఉన్న భారత్‌ను అనవసరపు పరుగు కోసం ప్రయత్నించి మరిన్ని కష్టాల్లోకి నెట్టాడు. రనౌట్ కావడమే కాకుండా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో రనౌట్ అయిన తొలి ఇండియన్ బ్యాట్స్‌మన్‌గా పుజారా నిలిచాడు.

ఆట 26వ ఓవర్.. ఫిలాండర్ బంతిని అందుకున్నాడు. తొలి బంతిని పార్దీవ్ పటేల్‌కు సందించాడు. దాన్ని పార్దీవ్ బలంగా బాదాడు. బంతిని చేజ్ చేసిన గిడి.. దాన్ని అందుకుని వెంటనే ఏబీ డివిలియర్స్‌కు అందించాడు. మరోవైపు రెండు పరుగులు పూర్తిచేసి మూడో పరుగు కోసం పుజారా గుడ్డిగా పరిగెత్తాడు. డివిలియర్స్ ఇచ్చిన త్రోను అందుకున్న కీపర్ డీకాక్ బేల్స్‌ను గాల్లోకి ఎగరవేశాడు.

మ‌రోసారి పాండ్యా నిర్ల‌క్ష్యంగా ఆడాడు. చెత్త బ్యాటింగ్ చేసి అవుట్ అయ్యాడు. అప్ప‌టికే భార‌త్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో మాదిరిగానే రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య (6; 12 బంతుల్లో) అత్యంత చెత్తగా ఔటయ్యాడు. ఐదు వికెట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు షాట్ల ఎంపిక ఆచితూచి ఉండాలి. ఆ ఆలోచనే లేకుండా లుంగి ఎంగిడి ఆఫ్‌సైడ్‌ దూరంగా వేసిన 35.3వ బంతిని అవసరం లేకున్నా వెంటాడి కీపర్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. మళ్లీ ఎంగిడి వేసిన 37.1వ బంతికే అశ్విన్‌ (3; 6 బంతుల్లో) డికాక్‌కు చిక్కాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -