- Advertisement -

కెరీర్‌లోనే బెస్ట్ ఫామ్‌లో ఉన్నా ఏబీ డివిలియర్స్….

- Advertisement -

రెండేళ్ల విరామం తర్వాత టెస్టు క్రికెట్లోకి పునరాగమనం చేసిన ఏబీ డివిలియర్స్ సత్తా చాటుతున్నాడు. భారత్‌తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో ఏబీ అద్భుతమైన ఆటతీరు కనబర్చాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 50 సగటుతో 200 పరుగులు చేశాడు. రెండు టెస్టుల్లోను డివిలియ‌ర్స్ అద్భుత ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచారు.

సెంచూరియన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో డివిలియర్స్ ఆటే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. 3 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజ్‌లో వచ్చిన డివిలియర్స్ వేగంగా ఆడి 80 పరుగులు రాబట్టాడు. మూడో వికెట్‌కు ఎల్గర్‌తో కలిసి 141 పరుగులు జోడించాడు. ఆ ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 258 పరుగులకే కుప్పకూలింది.

ఎల్గర్-డివిలియర్స్ జోడిని త్వరగా విడదీసి ఉంటే మ్యాచ్ భారత్ వైపు మొగ్గేదన్న అంచనాలను కొట్టి పారేయలేం. రెండేళ్ల తర్వాత టెస్టుల్లో అడుగుపెట్టి ఈ స్థాయిలో ఆడుతుండటంపై డివిలియర్స్ సంతోషం వ్యక్తం చేశాడు. తాను కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నానని భావిస్తున్నట్లు తెలిపాడు.

‘నేను బాగా ఆడుతున్నా. మ్యాచ్‌కు తగిన రీతిలో సన్నద్ధం అవుతున్నా. బంతిని సరిగా అంచనా వేస్తున్నాను. ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉన్నానని భావిస్తున్నా. గతంలోనూ ఇదే తరహా ఆటతీరు కనబర్చాను. వరుసగా ఐదు సెంచరీలు బాదలేకపోవచ్చు. వరుసగా ఐదు డకౌట్లు కావచ్చు. కానీ ఇప్పుడు నా ఆటతీరుతో సంతోషంగా ఉన్నా’ అని డివిలియర్స్ స్పష్టం చేశాడు. గాయాలు ఇబ్బంది పెడుతున్నా.. మంచి ఫామ్‌లో ఉండటం ఆనందంగా ఉందన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -