Sunday, May 12, 2024
- Advertisement -

జూనియ‌ర్ ధోనీ రిష‌బ్‌పంత్ రిజ‌ర్వ్ బెంచ్‌కే ప‌రిమిత‌మా…?

- Advertisement -

భారత జట్టులో జూనియర్ ధోనీగా పిలుచుకొనే రిషబ్ పంత్‌పై వేటు పడింది. కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో.. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ అవకాశం దక్కించుకున్న ఈ యువ వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ ఆశించిన మేర ర‌ణించ‌లేక‌పోవ‌డంతో రిజ‌ర్వ్‌కే ప‌రిమితం చేశారు.

సోమవారం రాత్రి శ్రీలంకతో జరిగిన మూడో మ్యాచ్‌లో అతడ్ని పక్కకి తప్పించి.. కేఎల్ రాహుల్‌కి కెప్టెన్ రోహిత్ శర్మ అవకాశం కల్పించాడు. సిరీస్‌లో ఫైనల్‌ కంటే ముందు ఒక మ్యాచ్ మాత్రమే (బంగ్లాదేశ్‌తో బుధవారం) మిగిలి ఉన్న నేపథ్యంలో.. మళ్లీ తుది జట్టులోకి పంత్ రావడం కష్టమనే చెప్పాలి

ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి మహేంద్రసింగ్ ధోనీకి భారత సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆస్థానంలో పంత్‌కి స్థానం ఇవ్వాల‌ని సీనియ‌ర్లు సూచించారు. ఇటీవల దేశవాళీ టోర్నీల్లో ఈ యువ క్రికెటర్ మెరుగ్గా రాణించడంతో.. సెలక్టర్లు కూడా అతనికే ఓటేశారు. దాదాపు ఏడాది తర్వాత దొరికిన అరుదైన అవకాశాన్ని రిషబ్ పంత్ చేజార్చుకున్నాడు.

శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో 23 బంతుల్లో 23 పరుగులు చేసిన పంత్.. కీలక సమయంలో వికెట్ చేజార్చుకుని నిరాశపరిచాడు. అనంతరం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పేలవ ఫుట్‌వర్క్‌తో బంతిని వికెట్లపైకి ఆడుకుని 7 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు.దీంతో తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన కేఎల్‌ రాహుల్‌కి మార్గం సుగుమమైంది. అయితే అనుకున్నంత రీతిలో రాహుళ్ రానించ‌లేదు. ప్ర‌స్తుతం పంత్‌కు నిరాశె త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -