Sunday, May 12, 2024
- Advertisement -

మొద‌టి వికెట్ కోల్పోయిన విండీస్‌

- Advertisement -

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైన రెండో టెస్ట్‌ లో వెస్టిండీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన విండీస్‌ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే సమయంలో టాస్ ఓడిపోవడం తమకేమీ ఇబ్బంది కాదని, రాజ్ కోట్ లో జరిగిన ఫలితమే ఇక్కడా కనిపిస్తుందని విరాట్ కోహ్లీ చెప్పాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నవిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ జట్టులో రెండు మార్పులు చేసినట్టు హోల్డర్ వెల్లడించాడు. కీమో పాల్, షెర్మన్ లూయిస్ స్థానంలో తాను, జోమెల్ వారికన్ జట్టులోకి వచ్చినట్లు చెప్పారు. మరోవైపు భారత జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి విశ్రాంతినిచ్చి.. శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు.

సొంతగడ్డపై మరో టెస్టు సిరీస్‌ విజయంపై టీమ్‌ఇండియా కన్నేసింది. ఇప్పటికే తొలి టెస్టులో భారీ విజయాన్ని అందుకున్న భారత్.. రెండో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇక్కడి పిచ్‌ ఎప్పట్లా స్పిన్నర్లకే అనుకూలిస్తే మాత్రం భారత్‌ను ఆపడం విండీస్‌ తరం కాదు. బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఆదిలోనే మొద‌టి వికెట్ కోల్పోయింది. ర‌వి చంద్ర‌న్ అశ్విన్ బౌలింగ్‌లో పావెల్ 22/30ర‌వీంద‌ర్ జ‌డేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -