Sunday, May 12, 2024
- Advertisement -

రిష‌బ్‌పంత్ మెరుపులు…విజ‌యం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ది

- Advertisement -

హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఉన్న బలం బౌలింగే… గట్టిగా నిలబడి బ్యాటింగ్ చేసే వారేరి? ఓ భారీ స్కోరును ఛేదించాల్సి వస్తే పరిస్థితేంటి? ప్లే ఆఫ్ లో భారీ స్కోరును ఎదుర్కోవాల్సి వస్తే ఓడిపోవాల్సిందేనా? ఇవి గత నెల రోజులుగా సన్ రైజర్స్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలు. ఆ అనుమానాల్సి ప‌టా పంచ‌లు చేస్తూ గత రాత్రి ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో డేర్ డెవిల్స్ తో ఆడిన హైదరాబాద్ జట్టు ఏకంగా 187 పరుగుల స్కోరును ఛేదించి, తాము బ్యాటింగ్ లోనూ తక్కువేమీ కాదని నిరూపించింది.

ఐపీఎల్ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయంతో సగర్వంగా ప్లేఆఫ్‌ బెర్తుని ఖాయం చేసుకుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు సమష్టిగా విఫలమైనా.. ఓపెనర్ శిఖర్ ధావన్ (92 నాటౌట్: 50 బంతుల్లో 9×4, 4×6), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (83 నాటౌట్: 53 బంతుల్లో 8×4, 2×6) మెరుపు అర్ధశతకాలు బాదడంతో హైదరాబాద్ జట్టు 9 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది.

అంతకముందు యువ హిట్టర్ రిషబ్ పంత్ (128 నాటౌట్: 63 బంతుల్లో 15×4, 7×6) ఆకాశమే హద్దుగా చెలరేగి శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఛేదన ఆరంభంలోనే హైదరాబాద్ జట్టు ఓపెనర్ అలెక్స్ హేల్స్ (14) వికెట్‌ని చేజార్చుకున్నా.. ధావన్ – విలియమ్సన్ జోడి రెండో వికెట్‌కి అభేద్యంగా 102 బంతుల్లో 176 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకి తిరుగులేని విజయాన్ని అందించారు.

మ్యాచ్ ఆరంభంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మంచి శుభారంభం లభించింది. ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా (9), జేసన్ రాయ్.. పవర్ ప్లే ముగిసేలోపే పెవిలియన్ చేరిపోవడంతో.. ఆ జట్టు 21/2తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో క్రీజులో వచ్చిన రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతూనే.. తన తత్తరపాటు కారణంగా.. శ్రేయాస్ అయ్యర్ (3), హర్షల్ పటేల్ (24: 17 బంతుల్లో 2×6)లను రనౌట్ చేయించాడు. దీంతో.. 14 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ 98/4తో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది.

హైదరాబాద్‌ డెత్‌ ఓవర్ల కింగ్‌ భువనేశ్వర్‌. అలాంటి అనుభవజ్ఞుడైన భువీని ఒక్కో షాట్‌తో నేలకు దించాడు రిషభ్‌ పంత్‌. ఇంతవరకు పూర్తి కోటాలో 25, 30 పరుగులిచ్చుకోని ఈ పేసర్‌ను ఫిఫ్టీ పరుగుల క్లబ్‌లో చేర్చాడు. భువీ వేసిన 18 ఓవర్లో 18 పరుగులు బాదేసిన యువ సంచలనం… చివరి ఓవర్లో అయితే శివమెత్తాడు. ఫీల్డర్లకు చిక్కని బౌండరీలను, ప్రేక్షకుల చేతికందే సిక్సర్లతో ఏకంగా 26 పరుగులు సాధించాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -