టీమిండియా ను కలవర పెడుతోన్న.. ఓపెనింగ్ జోడీ ?

- Advertisement -

క్రికెట్ లో ఏ జట్టుకైనా ఓపెనింగ్ అనేది అత్యంత కీలకం. ఎందుకంటే ఓపెనర్స్ ను బట్టే ఆ జట్టు మెరుగైన ఫలితాలను సాధిస్తుంది. ఓపెనింగ్ జోడీ ఇచ్చే మెరుగైన ప్రదర్శనను బట్టి ఆ జట్టు భారీ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అందుకే ప్రతి జట్టు కూడా క్రికెట్ లో ఓపెనింగ్ జోడీ పైన ప్రత్యేక దృష్టి సాధిస్తుంటాయి.ఇక టీమిండియా విజయనికొస్తే.. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ జోడీ ఓపెనింగ్ బాగస్వామ్యంలో మెరుగైన ఫలితాలను రాబట్టింది. ఇక ఆ తరువాత వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ ల జోడీ కూడా ఓపెనింగ్ లో పర్వాలేదనిపించింది. ఇక ఆ తరువాత టీమిండియాకు సరైన ఓపెనర్స్ కొరత ఏర్పడింది. ఎన్నో ప్రయోగాలు చేసినప్పటికీ .ఓపెనింగ్ జోడీ కూర్పు మాత్రం నిరాశపరుస్తూనే ఉంది.

అలాంటి సమయంలో అప్పటి టీమిండియా కెప్టెన్ ఎం‌ఎస్ ధోని.. రోహిత్ శర్మ, శీకర్ ధావన్ లను ఓపెనింగ్ జోడీ గా తీసుకువచ్చాడు. ఈ జోడీ చాలా కాలం వరకు టీమిండియా బెస్ట్ జోడీగా నిలిచింది. ఇక ఆ తరువాత ఫిట్ నెస్ కారణంగా ధావన్ మెల్లమెల్లగా జట్టుకు దూరమవుతూ రావడంతో మళ్ళీ ఓపెనింగ్ జోడీ కొరత ఏర్పడింది. ప్రస్తుతం టీమిండియా రెగ్యులర్ ఓపెనర్స్ గా రోహిత్ శర్మ, కే‌ఎల్ రాహుల్ ఉన్నారు.. కానీ కే‌ఎల్ రాహుల్ గైర్హాజర్ కారణంగా జట్టుకు దూరమవడంతో ప్రత్యామ్నాయ ఓపెనర్ కోసం జట్టు ప్రయోగాలు చేస్తూనే ఉంది.

- Advertisement -

ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన టి20 మ్యాచ్ లలో రిషబ్ పంత్ ఓపెనర్ గా దిగాడు.. ఇక ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో దీపక్ హుడా ఓపెనింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా వెస్టిండీస్ తో జరిగిన టి20 మ్యాచ్ లో రోహిత్ శర్మ తో కలిసి సూర్య కుమార్ యాదవ్ ఓపెనర్ అవతారం ఎత్తాడు. వీళ్ళే కాకుండా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, ఋతురాజ్ గైక్వాడ్ వంటి వారు కూడా అప్పుడప్పుడు ఓపెనర్స్ గా మారుతున్నారు. అయినప్పటికి ఫిక్సుడ్ ఓపెనింగ్ జోడీ మాత్రం సెట్ అవడం లేదనే చెప్పాలి. మరి రోహిత్ శర్మ, శికర్ ధావన్ ల తరువాత ఆ స్థాయిలో బెస్ట్ ఓపెనింగ్ జోడీ గా ఎవరు నిలుస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -