Saturday, May 11, 2024
- Advertisement -

ముంబ‌య్ నిలవాలంటే…కోల్‌క‌తాపై గెల‌వాల్సిందే

- Advertisement -

పీఎల్ 2018 సీజన్‌లో ప్లేఆఫ్‌ ఆశలు నిలవాలంటే ఇక ఆడే అన్ని మ్యాచ్‌ల్లోనూ ముంబ‌య్ ఇండియ‌న్స్ త‌ప్ప‌క గెల‌వాల్సిందే. మొద‌టినుంచి పేవ‌ల ఆట‌తీరును కొన‌సాగిస్తున్న రోహిత్ సేన ప్ర‌స్తుతం పుంజుకుంది. గత ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో కోల్‌కతాని ఓడించిన ముంబయి ఇండియన్స్.. అదే జోరుని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతుండగా..ప్రతీకారం తీర్చుకోవాలని కోల్‌కతా ఆశిస్తోంది.

ఈ రోజు రాత్రి 8 గంటలకి ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఢీకొట్టనుంది. ముంబయి జట్టులో ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూవిస్ మంచి ఫామ్‌లో ఉండగా.. హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ మిడిల్ ఓవర్లలో రాణిస్తున్నారు. కోల్‌కతాతో గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్, బౌలింగ్‌లోనూ ఆ జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది.

కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు గత మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్ మార్పుల కారణంగా దెబ్బతింది. ఓపెనర్ సునీల్ నరైన్‌ని మిడిలార్డర్‌లోకి పంపి.. ఓపెనర్‌గా శుభమన్ గిల్‌‌‌ పంపి చేసిన ప్రయోగం వికటించింది. ఆ మ్యాచ్‌లో గిల్ 7 పరుగులకే ఔటవగా.. మిడిల్ ఓవర్లలో కెప్టెన్ కార్తీక్‌కి సహకారం అందించేవారు కరవయ్యారు. దీంతో మునుపటి బ్యాటింగ్ ఆర్డర్‌నే మళ్లీ కోల్‌కతా కొనసాగించే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -