Saturday, May 4, 2024
- Advertisement -

కోహ్లీ భావోద్వేగాల‌ను అదుపు చేసుకోవాలి…

- Advertisement -

స‌ఫారీల‌తో టెస్ట్ సిరీస్ కోల్పోవ‌డంతో జ‌ట్టు ఎంపిక‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెల‌సిందే. విమ‌ర్శ‌ల‌పై మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు టీమిండియా కెప్టెన్ కోహ్లీ దురుసుగా స‌మాధాన‌మిచ్చారు. సిరీస్‌ మేం గెలిచి ఉంటే అత్యుత్తమ తుది జట్టు అన్న ప్రస్తావన వచ్చేదా?, ఊరికే కూర్చుని మాట్లాడటం కాదు. మైదానంలో దిగితే తెలుస్తుంది. ఇకపై జట్టును మీరే సెలక్ట్‌ చేయండంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కోహ్లీకి వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్ విలువైన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చారు.

మైదానంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి సహనం వహిస్తే.. కెప్టెన్‌గా అతను మరిన్ని విజయాలు అందుకోగలడని మైకేల్ హోల్డింగ్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో శనివారం ముగిసిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రత్యర్థి జట్టు వికెట్ తీసినప్పుడు విరాట్ కోహ్లి మరీ హద్దులు మీరి మైదానంలో సంబరాలు చేసుకుంటున్నాడని హోల్డింగ్ వివరించాడు. ఈ దురుసు సంబరాలు ప్రత్యర్థితో పాటు భారత్ జట్టు ఆటగాళ్లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని విండీస్ మాజీ పేసర్ వెల్లడించాడు.

ప్రస్తుత క్రికెట్‌లో విరాట్ కోహ్లినే యువ కెప్టెన్. అతను ఇప్పుడిప్పుడే జట్టు నాయకత్వ బాధ్యతలను అర్థం చేసుకుని.. మెళకువలు నేర్చుకుంటున్నాడు. మైదానంలో కోహ్లికి దూకుడెక్కువ.. భావోద్వేగాలను వెంటనే బహిర్గతం చేస్తున్నాడు. అతను అలా నియంత్రణ కోల్పోవడం‌ ప్రత్యర్థి జట్టుకే కాదు.. సొంత జట్టుకి కూడా చేటు చేస్తోంద‌న్నారు.

విండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ కూడా అంతే.. మొదట్లో మైదానంలో దూకుడు ప్రదర్శించేవాడు. కానీ.. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. నెమ్మదిగా భావోద్వేగాలను అదుపు చేసుకున్నాడు. దీంతో జట్టు ప్రదర్శన మెరుగై అసాధారణ విజయాలను అందుకోగలిగింది. విరాట్ కోహ్లి విషయంలోనూ ఇదే జరుగుతుందని నేను అనుకుంటున్నా’ అని హోల్డింగ్ వివరించాడు. ఎప్పుడైనా కెప్టెన్‌గా నీకు ఎదురైన ప్రశ‍్నను డిఫెన్స్‌ చేసుకోవాలి.. అంతేకానీ ఎదురుదాడి చేయకూడదు’ అని హోల్డింగ్‌ పేర్కొన్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -