Monday, April 29, 2024
- Advertisement -

చిన్నస్వామి స్టేడియంలో తిరుగులేని కేకేఆర్..

- Advertisement -

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్ విజయాల పరంపర కొనసాగుతోంది. 2016 నుండి ఐదు సార్లు ఆర్సీబీతో కోల్‌కతా తలపడగా ప్రతీసారి కేకేఆర్‌నే విజయం వరించింది. ఆర్సీబీ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా 16.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కొల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ సునీల్ నరైన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

వెంకటేశ్‌ అయ్యర్‌ 30 బంతుల్లో 4 సిక్స్‌లు,3 ఫోర్లతో 50, సునీల్‌ నరైన్‌ 22 బంతుల్లో 5 సిక్స్‌లు, 2 ఫోర్లతో 47, శ్రేయస్‌ అయ్యర్‌ 24 బంతుల్లో 2 సిక్స్‌లు,2 ఫోర్లతో 39 నాటౌట్‌గా నిలిచారు.

ఇక అంతకముందు టాస్ గెలిచిన కోల్‌కతా…ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. విరాట్‌ కోహ్లీ 59 బంతుల్లో 4 సిక్స్‌లు, 4 ఫోర్లతో 83 నాటౌట్‌, రాణించడంతో ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ఇక ఆర్సీబీపై గెలుపుతో ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని కేకేఆర్ నమోదుచేయగా సునీల్‌ నరైన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -